ఆలయం, మసీదు దెబ్బతినడంపై కేసీఆర్‌ ఆవేదన

10 Jul, 2020 13:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సచివాయం కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో వున్న దేవాలయం, మసీదు కొంత దెబ్బతిన్నాయి. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దాని కన్నా పెద్దగా, విశాలంగా ఆలయంతో పాటు మసీదును నిర్మించి ఇస్తామన్నారు. ఎత్తైన భవనాలు కూల్చే సందర్భంలో అక్కడే ఉన్న ప్రార్థనా మందిరాలపై శిథిలాలు పడి అవి దెబ్బతినడంపై తాను చాలా బాధపడుతున్నాను అన్నారు కేసీఆర్‌. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం తమ అభిమతం కాదన్నారు. ఆలయం, మసీదు నిర్వాహకులతో త్వరలోనే సమావేశమవుతానని, వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు