ఉద్యోగ సంఘాల డిమాండ్లపై కేసీఆర్‌ సమీక్ష

16 May, 2018 20:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఉద్యోగుల 18 డిమాండ్లు, ఉపాధ్యాయులకు సంబంధించి 34 డిమాండ్లపై ఈ సమావేశంలో చర్చించారు. సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలు, బదిలీలు, ప్రమోషన్ల, ఫిట్మెంట్‌, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల రప్పించటం వంటి ప్రధాన డిమాండ్లు మినహా మిగిలిన వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.

పది మందికే అనుమతి
ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల నాయకులు, జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జనం రావడంతో అందరీని లోపలికి పంపించడం కుదరలేదు. కేవలం పది మందికి మాత్రమే లోపలికి అనుమతించడంతో మిగతా ఉద్యోగులు ప్రగతిభవన్‌ వెలుపలే ఉండిపోయారు. దీంతో కొంత మంది ఉద్యోగులు ఇలాంటి ప్రభుత్వాన్ని తాము ఎప్పుడు చూడలేదని, ముందుగానే మాకు  సమాచారం అందించి ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మిగతా ఉద్యోగులు ప్రగతి భవన్‌ ముందు పుట్‌పాత్‌పై పడికాపులు కాశారు.  

మరిన్ని వార్తలు