ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరా..  

23 Aug, 2019 10:48 IST|Sakshi
చెల్లెపాడులో మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్వేతామహంతి   

అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌ సీరియస్‌

పెద్దదగడ, చెల్లెపాడు, చిన్నంబావిలో మొక్కల పరిశీలన  

సాక్షి, చిన్నంబావి(మహబూబ్‌నగర్‌) :  రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరం పనుల్లో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్‌ శ్వేతామహంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదురోజుల క్రితం వచ్చి చెప్పినప్పటికీ మీలో ఎందుకు మార్పు రావడంలేదని ప్రశ్నించారు. పెద్దదగడ గ్రామంలో ఉపాధి హామీ కూలీల చేత చేయించాల్సిన పనులను, మిషన్‌ ద్వారా ఎందుకు చేయించారని అని ప్రశ్నించారు. గురువారం మండలంలోని పెద్దదగడ, చెల్లెపాడు, చిన్నంబావి గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటకపోవడం, అదేవిధంగా గ్రామాల్లో 50శాతం కూడా పూర్తికాకపోవడంతో  అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

ఇది చదవండి : దండం పెడ్తాం.. మా ఉద్యోగాలు కాపాడండి

ప్లాస్టిక్‌ నిషేధిద్దాం..  
అదేవిధంగా ప్లాస్టిక్‌ రహిత గ్రామలుగా తీర్చిదిద్దడంలోనూ అధికారులు విఫలం అవుతున్నారని, కనీసం గ్రామంలోని ప్రజలకు అవగాహన కూడా కల్పించలేకపోతున్నారని అన్నారు. కనీసం మహిళా సంఘాలను కూడా చైతన్య పరచలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నా రు. హరితహరం కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన పెద్దదగడ గ్రామ కార్యదర్శి, ఫిల్డ్‌ అసిస్టెంట్‌కు షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వా లని అధికారులను ఆదేశించారు.  ఎంపీడీఓ బద్రీనాథ్, ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ సభ్యులు వెంకట్రామమ్మ, అభిలాష్‌ రావు, ఏపీఓ ఉన్నిస బేగ్, తహసీల్దార్‌ పర్‌కుందా తన్సిమా ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు