78 ఎఫ్‌ఓబీలు, సబ్‌వేలు

31 Jul, 2014 01:17 IST|Sakshi
  •  జీహెచ్‌ఎంసీకి ‘ట్రాఫిక్’ ప్రతిపాదనలు
  • సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు/ సబ్‌వేల ఏర్పాటుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ.. అవసరమైన ప్రాంతాలను సూచిస్తూ ప్రతిపాదనలు పంపాలని ట్రాఫిక్ పోలీసులను కోరింది. 78 ప్రాంతాల్లో పాదచారులకు ఇబ్బందులున్నట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు సదరు జాబితాను జీహెచ్ ఎంసీకి అందజేశారు. దీనిపై అధ్యయనానికి జీహెచ్‌ఎంసీ త్వరలో టెండరు పిలవనుంది. కన్సల్టెంట్ల నివేదికకనుగుణంగా వీటిని ఏర్పాటు చేస్తారు.
     
    ఎక్కడెక్కడంటే..
     
    సంగీత్, బోయిన్‌పల్లి, తాడ్‌బండ్, ప్యారడైజ్, తాడ్‌బన్, బోయిన్‌పల్లి, టోలిచౌకి (టెంపుల్), నానల్‌నగర్ జంక్షన్లు, రేతిఫైలి బస్టాప్, చిత్రదర్గ, శ్రీకార్ ఉపకార్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ చౌరస్తా, చిక్కడపల్లి పిల్లల పార్కు, అబిడ్స్ జీపీఓ, చర్మాస్, హిమాయత్‌నగర్ వీధినెంబరు 9, వీధినెంబరు 6, లిబర్టీ, లక్డీకాపూల్ లక్కీ హోటల్-అయోధ్య జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్డునెం. 45, బంజరాహిల్స్ రోడ్డునెంబరు 1/12, ఎంజే మార్కెట్, కోఠి ఆంధ్రాబ్యాంక్, సుల్తాన్‌బజార్ గాంధీ జ్ఞానమందిర్, ఐఎస్ సదన్, సైబర్ గేట్‌వే, కూకట్‌పల్లి బస్టాప్, కేపీహెచ్‌బీ బస్టాప్, మియాపూర్, విప్రో సర్కిల్, మాదాపూర్ వీఆర్ నగర్, చందానగర్, నిజాంపేట, మూసాపేట, నర్సాపూర్ క్రాస్‌రోడ్, ఎల్‌బీనగర్ రింగ్‌రోడ్డుకిరువైపులా, సరూర్‌నగర్ సాయిబాబా గుడి, అష్టలక్ష్మి ఆలయం, బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్, జీవీకేమాల్ రోడ్‌నెం 1, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజా, ట్యాంక్‌బండ్‌పై రెండు చోట్ల, బాలానగర్ జంక్షన్, సరోజిని కంటి ఆస్పత్రి, షాదాన్ కాలేజి, ఎంజీబీఎస్, కొండాపూర్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్, బీహెచ్‌ఈఎల్ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఉప్పల్ బస్టాప్, ఉప్పల్, ఉప్పల్ రింగురోడ్డు, వనస్థలిపురం ఎన్జీఓ కాలనీ, హయత్‌నగర్ బస్టాప్, బీఎన్ రెడ్డి నగర్, సాగర్ రింగ్‌రోడ్డు, జేబీఎస్, విక్రంపురి, తిరుమలగిరి చౌరస్తా, అల్వాల్ బస్టాప్, వెంకటాపురం బస్టాప్, సుచిత్ర సర్కిల్, కొంపలి సినీప్లానెట్, కండ్లకోయ, మేడ్చల్ బస్టాప్, నిమ్స్ గేట్ (బంజారాహిల్స్ రోడ్డు నెం.1), రైల్‌నిలయం.
     

మరిన్ని వార్తలు