పీఈసీ సమావేశం వాయిదా 

12 Feb, 2019 04:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం వాయిదా పడింది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కోసం మంగళవారం ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ ఉన్నందున పీఈసీ సమావేశం వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ వెల్లడించింది. అలాగే సోమవారం జరగాల్సిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కసరత్తుతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకుగాను ఈ నెల 15, 16, 17 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీ సమీక్షలు నిర్వహించనున్నారు.

అదే సమయంలో 16న టీపీసీసీ సమన్వయ కమిటీ, 17న ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల అనంతరమే షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపుతామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. లోక్‌సభ అభ్యర్థుల కసరత్తు వీలైనంత త్వరలో పూర్తి చేయాలని హైకమాండ్‌ నుంచి ఆదేశాలున్నాయని, ఈ నేపథ్యంలో 18 లేదా 19న షార్ట్‌లిస్ట్‌ చేసిన జాబితా ఢిల్లీకి వెళుతుందని, నెలాఖరుకల్లా అభ్యర్థులను కూడా అధికారికంగా ప్రకటిస్తారని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు