లాక్‌డౌన్‌: ‘20 రోజులుగా అడుగు బయటపెట్టలేదు’

11 Apr, 2020 13:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేయడం వల్లే కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో ఉందని టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ పేర్కొన్నాడు. తెలంగాణలో లాక్‌డౌన్‌ సక్రమంగా అమలవుతోందని ఈ విషయంలో పోలీసుల పాత్ర గొప్పదని ప్రశంసించారు. శనివారం డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీసులకు ఫేస్‌ మాస్కులు, సేఫ్టీ గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌తో పాటు హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు శంకర్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో లాక్‌డౌన్‌ స్ట్రాంగ్‌గా అమలవుతోంది. నేను బయటి ప్రపంచాన్ని చూసి 20 రోజులు అవుతోంది. లాక్‌డౌన్‌ వల్లే ఈ రోజు పరిస్థితి అదుపులో ఉంది. ఈ విషయంలో పోలీసుల పాత్ర గొప్పది. ఇంట్లో లాక్‌డౌన్‌ పాటిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. లాక్‌డౌన్‌ పాటించని వారు దయచేసి పాటించాలి’అని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ కార్యాలయానికి చేరుకున్న విజయ్ కాసేపు ఆయనతో ముచ్చటించారు. కరోనాపై పోరాటంలో పోలీసులు చేస్తున్న విశేష కృషి, సేవకి విజయ్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. 

చదవండి:
కష్టమే..అయినా తప్పదు - ఇటలీ ప్రధాని
మాటపై నిలబడ్డా.. ఇక మీ వంతు

మరిన్ని వార్తలు