శునకానికి దశదిన కర్మ.. అన్నదానం

10 May, 2015 19:34 IST|Sakshi
శునకానికి దశదిన కర్మ.. అన్నదానం

కుత్బుల్లాపూర్(రంగారెడ్డి జిల్లా): మూడున్నర ఏళ్ల నుంచి ఆ కుటుంబంలో కలసి పోయిన ఆ కుక్క అనారోగ్యంతో మృతి చెందింది. దాని యజమాని ఆదివారం దశదిన కర్మ నిర్వహించి ఆత్మీయత చాటుకున్నాడు. చింతల్ రంగానగర్‌కు చెందిన జె.లక్ష్మణ్‌రావు, రాణి సులోచనలకు ఇద్దరు సంతానం. జూబ్లీ హిల్స్‌లోని ఓ ఇంట్లో బ్లేజ్ జాతికి చెందిన జర్మన్ షెపర్డ్ శునకాన్ని 2011, సెప్టెంబరు 6న తెచ్చుకుని మూడో కుమారుడిగా భావించి ఆ శునకానికి 'కన్నా' అని పేరు పెట్టారు.

ఎంతో ఆప్యాయతతో పెంచుకుంటున్న కన్నా ఏప్రిల్ 20న అనారోగ్యంతో చనిపోయింది. ఇంటి యజమానులు ఆత్మీయతను చంపుకోలేక శునకానికి ఆదివారం దశదిన కర్మ నిర్వహించి అన్నదానం నిర్వహించారు. వంద మంది కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని శునకం (కన్నా) చిత్రపటానికి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు