అపురూప ఘడియలు

19 Feb, 2016 09:45 IST|Sakshi
అపురూప ఘడియలు

రాత్రి 8.04 గంటలకు గద్దెకు చేరిన సమ్మక్క
 
చిలకలగుట్ట వద్ద అధికారిక స్వాగతం
గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ,
గోవిందరాజులు, పగిడిద్దరాజు
అపురూప ఘడియల్లో మొక్కులు
చెల్లించుకునేందుకు పోటీ పడిన భక్తులు
{పారంభమైన తిరుగు ప్రయాణాలు

 
హన్మకొండ :  మేడారం అడవుల్లో రెండేళ్లకోసారి చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి సమ్మక్క చేరుకునే ఉద్విగ్న, అద్భుత క్షణాలు గురువారం సాయంత్రం ఆవిష్కృతమయ్యాయి. సమ్మక్క పూజారులు చిలకలగుట్ట నుంచి కిందకు దిగగానే మేడారం అడవులు భక్తిభావంతో పులకించిపోయాయి. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరుకుంది. అంతకు ముందే అంటే బుధవారం రాత్రే సారలమ్మ,  పగిడిద్దరాజు, గోవిందరాజులు సైతం గద్దెల పైకి వచ్చారు. దీంతో భక్తులు ఒకేచోట నలుగురిని దర్శించుకుని తన్మయత్వానికి లోనయ్యూరు.  

ఉత్కంఠ.. ఉద్విగ్నం..
సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చేందుకు పూజారులు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరారు. సమ్మక్కకు భక్తులు వివిధ పద్ధతుల్లో స్వాగతం పలికారు. మేడారం నుంచి చిలకలగుట్ట వరకు ఉన్న కిలోమీటరున్నర మార్గాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు రోడ్డు శోభాయమానంగా మారింది. సమ్మక్క వచ్చే వరకు తమ ముగ్గులు చెడిపోకుండా చూసేందుకు అక్కడే ఉండిపోయూ రు. తమ ఇంటి ఇలవేలుపు సమ్మక్కకు ఎదుర్కోళ్లు పలుకుతూ భక్తులు కోళ్లు, మేకలు బలి ఇచ్చారు. మార్గానికి ఇరువైపులా వేలా ది మంది భక్తులు సమ్మక్క రాకకోసం గంటల తరబడి ఎదురుచూశారు. చిలకలగుట్ట దారిలో అడుగడుగునా భక్తులకు దేవుడు పూనాడు. వారు చేసే నాట్యాలతో మేడారం ప్రాంగణం హోరెత్తిపోయింది. చిలకలగుట్ట దారికి ఇరువైపులా ఉన్న చెట్టుపుట్టలపైకి ఎక్కి సమ్మక్కను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు.
 
5:58 గంటలకు...
క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా గడుస్తున్నా భక్తుల్లో ఒకటే కోరిక.. చిలకలగుట్ట నుంచి గద్దెలను చేరే సమ్మక్కను కనులారా చూడాలని. సాయంత్రం 5:58 గంటలకు సమ్మక్కను తీసుకుని పూజారులు సిద్ధబోయిన మునీందర్, కొక్కెర కృష్ణయ్య, మహేశ్ తదితరులు చిలకలగుట్ట దిగారు. సమ్మక్క రాకను సూచి స్తూ బూర శబ్ధం వినగానే అప్పటికే ఎదురు చూస్తున్న కలెక్టర్ కరుణ, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ఎదురెళ్లి స్వాగ తం పలికారు. సమ్మక్క రాకను సూచిస్తూ గాలిలోకి కాల్పులు జరి పారు. అనంతరం చిలకలగుట్ట నుంచి మేడారం వైపుగా సమ్మక్కను తీసుకుని వడ్డెలు బయలుదేరారు. మరోసారి సాయంత్రం 6:08 గంటలకు ఎస్పీ గాలిలోకి కాల్పులు జరిపారు. చివరగా చిల కలగుట్ట ముఖద్వారం వద్ద మూడోసారి 6:11 గంటలకు కాల్పులు జరిపి చిలకలగుట్ట రోడ్డుపైకి సమ్మక్క చేరుకుంది. అప్పటి వరకు ఆర్తిగా ఎదురు చూసిన భక్తులు సమ్మక్కపై పసుపు బియ్యం చల్లారు. దారిపొడవునా ఈ బియ్యపు జల్లులు కురిసాయి. సమ్మ క్క వచ్చిందన్న వార్త తెలియగానే ఒక్కసారిగా శివసత్తులు పూనకంతో ఊగిపోయారు.  
 
గద్దెలపైకి చేరిన సమ్మక్క..

చిలకలగుట్ట దిగిన తర్వాత ఎదురెళ్లుకాడ అరగంట పాటు వడ్డెలు పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం వైపు వడివడిగా సాగారు. మధ్యలో చెలపెయ దగ్గర మరోసారి పూజలు నిర్వహిం చారు. అనంతరం మేడారం ఆడపడుచులు నీరు ఆరబోసి  స్వాగ తం పలికారు. సమ్మక్కను గద్దెలపైకి చేర్చే వరకు భక్తుల దర్శనాలు ఆపేశారు. మేడారం గ్రామం చేరుకున్న సమ్మక్కను తొలుత గుడికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. వెంటనే ప్రాంగణంలో విద్యుత్ దీపాలను ఆర్పేశా రు. గద్దెలపైకి చేరుకున్న వడ్డెలు అక్కడ పూజలు నిర్వహించారు.  అనంతరం రాత్రి 8:04 గంటలకు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. అంతకు ముందు సమ్మక్క గద్దెపైకి వనం తెచ్చే కార్యక్రమాన్ని బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మక్క పూజారులు నిర్వహించారు. గురువారం ఉదయం కంకవనాన్ని గద్దెలపైకి తీసుకొచ్చారు.
 
అధికారుల ఘన స్వాగతం
ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమ్మక్కకు స్వాగతం పలి కారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ప్రభుత్వ సలహాదారు బీ.వీ. పాపారావుతో పాటు  జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా, జాతర ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, ములుగు మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య సమ్మక్కకు స్వాగతం పలికారు. మేడారం జాతరలో కీలక ఘట్టాలైన సారల మ్మ, సమ్మక్కలకు స్వాగతం పలికే కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ గైర్హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్ గద్దెల వద్ద పరిస్థితి పర్యవేక్షించారు.
 

మరిన్ని వార్తలు