ఫోన్‌ పోయింది.. వెతికివ్వండి లేకపోతే...

14 Nov, 2018 07:48 IST|Sakshi
ట్యాంక్‌ నుంచి దించుతున్న పోలీసులు, ఇన్‌సెట్‌లో తులసీనారాయణస్వామి

ధర్పల్లి(నిజామాబాద్‌ రూరల్‌): తప్పతాగిన మైకంలో ఓ వ్యక్తి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. తాళ్ల సాయంతో కిందికి దించి సురక్షితం గా ఇంటికి చేర్చారు పోలీసులు. మండలంలోని దమ్మన్నపేట్‌ గ్రామానికి చెందిన పెయింటర్‌గా పని చేస్తున్న తులసీనారాయణస్వామి అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం తప్పతాగిన మైకంలో ధర్పల్లి గ్రామ శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వెనుక గల వాటర్‌ ట్యాంక్‌ను ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ట్యాంక్‌ సమీపంలోని హోటల్‌ వద్దకు ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి టీ తాగుతున్నారు. నా సెల్‌ఫోన్‌ పోయిందని మీరే వెతికి పెట్టాలని కానిస్టేబుళ్ల వద్ద తాగిన మైకంలో తుల్లుతూ తులసీనారాయణస్వామి అనే వ్యక్తి అడిగారు.


కానిస్టేబుళ్లు వెతికి పెట్టుతాములే టీ తాగు అని అతడికి టీ ఇప్పించారు. వ్యక్తి టీ తాగి పక్కనే గల వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాడు. కానిస్టేబుల్‌ మాన్‌సింగ్‌ చాకచక్యంగా ట్యాంక్‌పైకి ఎక్కి వ్యక్తిని పట్టుకొని ఇతర వ్యక్తుల సహాయంతో పాటు తాళ్లతో బం ధించి కిందికి దించారు. ట్యాంక్‌ కిందికి దించే సమయంలో స్వామి జై తెలంగాణ.. అంటూ నినాదాలు చేశాడు. పరిస్థితిని ధర్పల్లి సీఐ ప్రసాద్, ఎస్‌ఐ పాండేరావు పరిశీలించారు.

ఇదే వాటర్‌ ట్యాంక్‌పై నుంచి గతంలో ఒకరు ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమై వ్యక్తిని సురక్షితంగా రక్షించారు. పెయింటర్‌ స్వామిని పోలీసు లు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి దమ్మన్నపేట్‌ గ్రామానికి తీసుకెళ్లారు. స్వామి 25 ఏళ్ల క్రితం దమ్మన్నపేట్‌కు వచ్చి పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడికి భార్య, పిల్లలు లేనట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు