ఇంజినీరింగ్ అడ్మిషన్ల కొనుగోలు దందా

3 Nov, 2014 02:11 IST|Sakshi

కోదాడటౌన్ :ఇంజినీరింగ్ అడ్మిషన్ల కొనుగోలు దందాలో కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. కోదాడ కేంద్రంగా రెండేళ్లుగా జరుగుతున్న ఈ వ్యాపారం నిర్వహిస్తున్న వీరిద్దరు శని వారం హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. నిందితులది అస్సాం రాష్ర్టం కాగా వారిద్దరూ కోదాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ చేస్తున్నారు. వారి వద్ద భారీ ఎత్తున నకిలీ సర్టిఫికెట్లు లభ్యమాయ్య యి.  వీరిని నమ్ముకుని అడ్మిషన్ల కోసం కొన్ని ఇంజి నీరింగ్ కళాశాలల నిర్వాహకులు లక్షల రూపాయలు ముట్టజెప్పగా వారికి  ముందస్తుగా కొన్ని విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చినట్లు సమాచారం. కాగా వీటిలో ఎక్కువగా నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని తేలడంతో డబ్బులు ముట్టజెప్పిన కళాశాలల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కౌన్సెలింగ్ అనుమతి రాక నానా ఇబ్బందులు పడుతున్న కళాశాలల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల విద్యార్థులపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇంతలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూడడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అంతేకాకుండా పోలీస్ ఉన్నతాధికారులు కోదాడపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక బృందాలను దర్యాప్తు కోసం కోదాడకు పంపారు.
 
 అసలేం జరిగిందంటే..
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఒక్క కోదాడలోనే ఉత్తర భారతదేశానికి చెందిన విద్యార్థులు సుమారు 2 వేల మంది ఇం జినీరింగ్, పాలిటెక్నిక్, బీఫార్మసీ కోర్సుల్లో చేరారు.  కొన్ని కన్సల్టెన్సీలు ఉత్తరాది నుంచి విద్యార్థులను తీసుకువచ్చి  ఇక్కడి కళాశాలల్లో చేర్పించాయి. అం దుకు గాను ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 నుంచి రూ.50 వేల వరకు కమిషన్ తీసుకున్నట్లు తెలిసిం ది. మొదట కోదాడకు చెందిన ఓ మైనార్టీ కళాశాల కొంతమంది బీహార్ విద్యార్థులను చేర్చుకుంది. వా రిని అనుసరించి ఇప్పుడు కోదాడలోని మరో నా లుగు కళాశాలలు పాలిటెక్నిక్,ఇంజినీరింగ్‌లో 2000 విద్యార్థులకు గడిచిన రెండేళ్ల నుంచి అడ్మిషన్లు ఇ చ్చాయి. విద్యార్థుల ఉండటానికి రెండు కళాశాలలు ప్రత్యేక హాస్టళ్లు, తరగతులను నిర్వహిస్తున్నాయి.  
 
 భారీగా ఉపకార వేతనాలు
 బీహార్, చత్తీగఢ్, అస్సాం రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతుల వారికి కల్యాణయోజన పథకం కింద కేం ద్రం భారీగా ఉపకార వేతనాలు ఇస్తుంది.  ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నవారి ఆత్రుతను ఇద్దరు ఎంటెక్ విద్యార్థులు అదునుగా భావించారు.  నకిలీ సర్టిఫికెట్లను సృష్టించి విద్యార్థులను కళాశాల లకు అంటగట్టి వారి నుంచి కమిషన్ రూపంలో లక్ష ల రూపాయలు కాజేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇంజినీరింగ్ అ డ్మిషన్ల కొనుగోలు దందా ఇప్పుడు తెలంగాణ రాష్ర్ట మంతటా విస్తరించింది. గతంలోనూ చాలా మంది నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఇక్కడి కోర్సుల్లో చేరి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీ సుల దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకా శాలున్నాయి.
 

మరిన్ని వార్తలు