గుండెబోయిన రాంమూర్తి యాదవ్ కన్నుమూత

12 Oct, 2019 09:47 IST|Sakshi

సాక్షి, నల్గొండ : నాగార్జున సాగర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమ్మూర్తి యాదవ్‌ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన 1947 ఆక్టోబర్‌ 26 న గుండెబోయిన మట్టయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. మొదటిసారిగా 1981 లో పెద్ద దేవులపల్లి గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1994 నుంచి 1999 వరకు అప్పటి చలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించారు. ఈ ఎన్నికల్లో అ‍ప్పటి వరకు ఓటమి ఎరుగని మాజీ మంత్రి జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తిగా రాంమ్మూర్తికి మంచి పేరు ఉంది. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన రాంమూర్తి యాదవ్‌ పేద ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాంతం తాపత్రయ పడ్డారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా