బ్యాంకు ముందు రైతుల ధర్నా

30 May, 2018 11:29 IST|Sakshi
బ్యాంకు ముందు ఆందోళన చేస్తున్న రైతులు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం తాలూకు సొమ్ము వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో పలువురు రైతులు స్థానిక సహకార బ్యాంకు ఎదుట మంగళవారం ధర్నా చేశారు. భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు నిమ్మ నారాయణరెడ్డి మాట్లాడుతూ, రైతులు ధాన్యం విక్రయించి ఇరవై రోజులు దాటినా వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమకాలేదన్నారు. 48గంటలలో రైతు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పిన అధికారులు.. ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారని విమర్శించారు. కలెక్టర్‌ స్పందించి రైతులకు తక్షణమే ధాన్యం సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో రైతులు మర్రి శ్రీనివాస్‌రెడ్డి, లింగాగౌడ్, చంద్రం, భూమయ్య, దేవారెడ్డి, ద్యాప దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు