రైతుల నిరసన.. భారీ ట్రాఫిక్‌ జామ్‌

3 Jun, 2020 10:23 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో తాత్కాలిక మార్కెట్ నిలిపివేయడంతో బుధవారం రైతులు రోడ్డెక్కారు. అంతేగాకుండా అంతకుముందు ఉన్న మార్కెట్ యార్డుకు తాళం వేసి కూరగాయలు అమ్మనివ్వక పోవడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి-సిరిసిల్ల రోడ్డుపై ఉదయం 5 గంటల నుంచి బైఠాయింపు చేస్తున్నారు. దీంతో రోడ్డుపై భారీగా  ట్రాఫిక్  నిలిచిపోయింది. ఇన్నాళ్ళూ లాక్‌డౌన్ వేళ కామారెడ్డిలో మొత్తం 4 తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేశారు. అయితే సిరిసిల్ల రోడ్డు బీట్ బంద్‌ చేయడంపై అన్నదాతలు నిరసన తెలుపుతున్నారు. తమకు శాశ్వత పరిష్కారం వచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. (వారంతా రోడ్లపై ఎందుకున్నారు)

మరిన్ని వార్తలు