27న పోలీసు పరీక్షల తుది ‘కీ’ 

26 May, 2019 02:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ పోలీసు ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్‌ ఆధారిత తుది ‘కీ’ని(ఆబ్జెక్టివ్‌ టైప్‌) ఈ నెల 27న తమ వెబ్‌సైట్‌  www. tslprb. in లో అందుబాటులో ఉంచుతున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్‌సీటీ ఎస్‌ఐ, ఎస్‌సీటీ ఎస్‌ఐ ఐటీఅండ్‌సీ, ఎస్‌సీటీ ఏఎస్‌ఐ ఎఫ్‌పీబీ, ఎస్‌సీటీ పీసీ, ఎస్‌సీటీ పీసీ ఐటీ అండ్‌ సీ, ఎస్‌సీటీ పీసీ డ్రైవర్, ఎస్‌సీటీ పీసీ మెకానిక్‌ పోస్టులకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ లాగిన్‌ ఏరియాల్లో ఆబ్జెక్టివ్‌ టైప్‌లో రాసిన పరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల వ్యక్తిగత ఓఎంఆర్‌ షీట్‌ స్కాన్‌ చేసిన కాపీలను ఉంచుతామని పేర్కొన్నారు. తమ యూజర్‌ అకౌంట్ల నుంచి ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి స్కాన్‌ కాపీలను యాక్సెస్‌ చేయొచ్చని తెలిపారు.

ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈనెల 28వ తేదీ ఉదయం 8 నుంచి మే 30వ తేదీ రాత్రి 8 గంటల వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్క పేపర్‌ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం రూ.2 వేలు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు), రూ.3 వేలు (ఇతరులు, స్థానికేతరులతో సహా) సర్వీసు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కులం, వయసు, స్థానిక అభ్యర్థి, ఎక్స్‌ సర్వీస్‌మెన్, అకడమిక్‌ అర్హతలకు సంబంధించి ఎడిట్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు