తల్లిదండ్రులకు ఆడశిశువు అప్పగింత

11 Apr, 2018 13:19 IST|Sakshi
తల్లిదండ్రులకు శిశువును అప్పగిస్తున్న అనితారెడ్డి

పర్వతగిరి(వర్ధన్నపేట): మూడో కాన్పులో ఆడ శిశువు జన్మించిందని తల్లిదండ్రులు విక్రయించగా, బాలల సంరక్షణ అధికారి అడ్డుకుని కౌన్సెలింగ్‌ చేసిన తర్వాత తిరిగి వారికి మంగళవారం అప్పగించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన దంపతులకు మొదటి కాన్పులో పాప, రెండో కాన్పులో బాబు జన్మించారు. మూడో కాన్పులో ఆడ శిశువు జన్మించగా ఐదు రోజుల పసికందును పరకాలకు చెందిన వారికి మధ్యవర్తుల సాయంతో ఇచ్చేశారు. విషయం తెలిసి బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి, ఐసీడీఎస్‌ అధికారులతో విచారణ జరిపారు. చట్టవిరుద్ధంగా విక్రయించినట్లు తేలగా మంగళవారం హన్మకొండలోని బాలల సంరక్షణ కార్యాలయంలో వారిని హాజరయ్యారు. ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి పసికందును తల్లిదండ్రులకు జిల్లా బాలల సంరక్షణ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి అప్పగించారు. సర్పంచ్‌ పల్లకొండ రజిత, సీడీపీఓ భాగ్యలక్ష్మి, సూపర్‌వైజర్లు సలోని, విక్టోరియా ఉన్నారు.

మరిన్ని వార్తలు