గిరిజన గ్రామాల అభివృద్ధికి  పెద్దపీట

25 Jan, 2018 20:04 IST|Sakshi
శంకుస్థాపన చేస్తున్న జెడ్పీటీసీ తోట ఆగయ్య 

ఎల్లారెడ్డిపేట : గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జెడ్పీటీసీ తోట ఆగయ్య అన్నారు. వీర్నపల్లి మండలం గర్జనపెల్లి శివారులోని భిక్షపతి, పూనానాయక్, లచ్చయ్య తండాల్లో రూ.81 లక్షలతో నిర్మించనున్న బీటీరోడ్డు పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా గిరిజనులు అడవుల్లో దుర్భర జీవితాలు గడిపారన్నారు. వారి జీవితాల్లో మార్పు తేవడానికే ప్రభుత్వం తండాల మధ్య లింకురోడ్లు ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్‌ అందె సుభాష్, ఎల్సాని మోహన్‌కుమార్, ప్రభాకర్, సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీటీసీ కమల, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు శ్రీరాంనాయక్, విఠల్, భాస్కర్, రాజిరెడ్డి, రవి, శేఖర్, తిరుపతి, బుగ్గయ్య పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు