కొనుగోలు కేంద్రాన్ని అడ్డుకోవడం సరికాదు.. 

27 Apr, 2018 11:33 IST|Sakshi
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌(జగిత్యాల) : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అటవీశాఖ  అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం బీర్‌పూర్‌ మండలం చెర్లపల్లిలో స్థానిక విండో ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు గురువారం బీర్‌పూర్‌ వెళ్లారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన భూమి తమదని..కేంద్రాన్ని ఎత్తివేయాలని అటవీశాఖ తొలగించాలని రేంజర్‌ ఉత్తంరావు సూచించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధికారులతో చర్చించారు. భూమిపై అటవీ, రెవన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి.. తేల్చాలని సూచించారు.

ఉమ్మడి సర్వే కోసం కలెక్టర్‌ను కోరుతానని.. ప్రస్తుతం అభ్యంతరం చెప్పడం సరికాదని ఎమ్మెల్యే అనడంతో అటవీశాఖ అధికారులు వెనక్కు తగ్గారు. సారంగాపూర్, బీర్‌పూర్‌ మండలాల్లో ఐకేపీ, సింగిల్‌విండోల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

లచ్చక్కపేట, రంగపేట, సారంగాపూర్, రేచపల్లి, బీర్‌పూర్, కొల్వాయి, మంగేళ, చెర్లపల్లి గ్రామాల్లోనూ ప్రారంభించారు. ఎంపీపీ కొల్ముల శారద, జెడ్పీటీసీ భూక్య సరళ, సింగిల్‌విండో చైర్మన్‌ ముప్పాల రాంచందర్‌రావు, తహసీల్దార్‌ వసంత, రాజేందర్, ఎంపీడీవో పుల్లయ్య, వైస్‌ఎంపీపీ కోండ్ర రాంచంద్రారెడ్డి, విండో చైర్మన్లు ముప్పాల రాంచందర్‌రావు, సాగి సత్యంరావు, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ  ఇబ్రహీం, ఐకేపీ ఏపీఎం గంగాధర్, సర్పంచులు పాల్గొన్నారు.    

 Congress MLA Jeevan Reddy 

మరిన్ని వార్తలు