యథావిధిగా గ్రూప్‌–2 ఇంటర్వ్యూలు

23 Jul, 2019 01:51 IST|Sakshi

ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా జరుగుతున్న గ్రూప్‌–2 ఇంటర్వ్యూలను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. ఈ అంశంపై గత నాలుగేళ్లుగా జరుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. దీనిపై వివాదం కొనసాగించడం మంచిది కాదని ధర్మాసనం పేర్కొంటూ గ్రూప్‌–2 నియామకాలపై దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. గ్రూప్‌–2 నియామకాల కోసం టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో లోపాలున్నాయని, కొందరు జవాబు పత్రాల్లో వైట్‌నర్‌ ఉపయోగించారని గతంలో కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ 2017 లో తీర్పు ఇచ్చింది. అయితే దీనిని తొలి జాబితాలో ఎంపికైన వారు సవాలు చేయగా.. 2019లో జస్టిస్‌ రామసుబ్రమణ్యం నేతృత్వంలోని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టేసింది.

ఈ డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఆధారంగా టీఎస్‌పీఎస్సీ.. గ్రూప్‌–2 అభ్యర్థులకు ఇప్పటికే ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభించింది. 45 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. డివిజన్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ సింగిల్‌ బెంచ్‌లో ఊరట లభించిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంటర్వ్యూలను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. జస్టిస్‌ రామసుబ్రమణ్యం ధర్మాసనం తీర్పు బాగుందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసు కుని రాసిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.  

స్టేలతో జాప్యం దురదృష్టకరం.. 
ప్రభుత్వ రంగంలో జరిగే నియామక ప్రక్రియలో కేసులు, స్టేల కారణంగా జాప్యం జరుగుతుండటం దురదృష్టకరమని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. సింగిల్‌ జడ్జి ముగ్గు రు సీనియర్‌ న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు చేసి 20 వేల ఆన్సర్‌ షీట్లను వారితో పరిశీలింపజేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి వ్యవహారాల్లో కోర్టు న్యాయవాదుల కమిటీ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టడం మంచిదని పిటిషన్‌ను తోసిపుచ్చారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కళ్లు’గప్పలేరు!

సకల హంగుల పట్టణాలు! 

పోటెత్తిన గుండెకు అండగా

ఎక్కడున్నా.. చింతమడక బిడ్డనే!

చిరునవ్వులు కానుకగా ఇవ్వండి 

మరో 5 లక్షల ఐటీ జాబ్స్‌

‘దాశరథి’ నేటికీ స్ఫూర్తిదాయకం

ఈనాటి ముఖ్యాంశాలు

‘సాక్షి’ జర్నలిజం తుది ఫలితాలు విడుదల

పాములకు పాలుపోస్తే ఖబర్దార్‌!

మల్కాజ్‌గిరి కోర్టు సంచలన తీర్పు

భర్త హత్య కేసులో భార్యే నిందితురాలు

అంతకు మించి స్పీడ్‌గా వెళ్లలేరు..!

చింతమడక వాస్తు అద్భుతం: కేసీఆర్‌

‘ఎంట్రీ’ మామూలే!

ఆర్థికసాయం చేయండి

‘కేసీఆర్‌.. జగన్‌ను చూసి నేర్చుకో’

తెలుగు బిగ్‌బాస్‌పై పిటిషన్‌: హైకోర్టు విచారణ

సొంతూరుకు సీఎం..

తగ్గనున్న ఎరువుల ధరలు!

కా‘లేజీ సార్లు’

అక్రమంగా ఆక్రమణ..

ఒక ఇంట్లో ఎనిమిది మందికి కొలువులు

స్వస్థలానికి బాలకార్మికులు.. 

మారు బోనం సమర్పించాలి : స్వర్ణలత

‘చౌక’లో మరిన్ని సేవలు 

సిటీలో కార్‌ పూలింగ్‌కు డిమాండ్‌..!

సిబ్బంది లేక ఇబ్బంది

‘కాళేశ్వరం’ తొలి ఫలితం జిల్లాకే..

సీసీఎస్‌ ‘చేతికి’ సీసీటీఎన్‌ఎస్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌