యువతి కిడ్నాప్‌; సీసీటీవీ ఫుటేజ్‌ లభ్యం..!

26 Jul, 2019 12:52 IST|Sakshi

టోల్‌ ప్లాజా వద్ద సీసీటీవీల్లో నిందితుడు

శ్రీశైలంవైపు కారు వెళ్లినట్టు గుర్తింపు

తండ్రిపై కూడా అనుమానాలు..!

సాక్షి హైదరాబాద్‌ : హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న సోని(21) కిడ్నాప్‌ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన రవిశంకర్‌గా గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలిసింది. 45 పైగా కేసుల్లో రవిశంకర్‌ నిందితుడిగా ఉన్నట్టు సమాచారం. కిడ్నాప్‌నకు వాడిన కారును బళ్లారిలో నెల రోజుల క్రితం చోరీ చేసినట్లుగా తెలిసింది. కంకిపాడు, తల్లాడ, విజయవాడ, బళ్లారిలో అతనిపై కేసులున్నాయి. రవిశంకర్‌కు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలతో లింకులున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మంగళవారం (23వ తేదీ) రాత్రి 8:50 గంటలకు పెద్ద అంబర్‌పేట టోల్‌గేట్‌ మీదుగా కిడ్నాపర్‌ కారు తీసుకెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. తుక్కుగూడ ఎగ్జిట్‌ మీదుగా శ్రీశైలం వైపుగా ఆ కారు వెళ్లింది. కర్నూలు జిల్లాలో నిందితుడు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్‌ కేసును ఛేదించేందుకు డీసీపి సన్‌ప్రీత్‌సింగ్‌ పర్యవేక్షణలో ఐదు బృందాలు పనిచేస్తున్నాయని ఏసీపీ గాంధీ నారాయణ తెలిపారు. కూతురురికి ఉద్యోగం ఇస్పిస్తానని నమ్మబలికిన ఓ దుండగుడు ఎలిమినేటి యాదగిరి కూతురు సోనిని కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే. బొంగ్లూర్‌ గేటు వద్ద యాదగిరి టీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
(ఎవరు?..ఎందుకు?)

మాయమాటలు చెప్పి.. మోసం : సోని తండ్రి
నిందితుడికి సుమారు 35–40 ఏళ్ల్ల వయస్సు ఉంటుంది. శ్రీధర్ రెడ్డిగా పరిచయం చేస్తుకున్నాడు. తను ఉస్మానియాలో డాక్టర్‌ను అని, అతని తల్లిదండ్రులు హైకోర్టులో జడ్జిలని చెప్పాడు. తన సోదరుడు పోలీసు కమిషనర్‌ అని నమ్మబలికాడు. నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో నిందితుని మాటలు నమ్మాను. ఉదయం 7:30 గంటలకు మా టీ స్టాల్‌ వద్దకు వచ్చి మచ్చిక చేసుకున్నాడు. అతనితో పాటు ఇబ్రహీంపట్నం వరకు వెళ్ళి కారును వాషింగ్‌ కూడా చేయించాను. పోలీసులు నా కూతురిని క్షేమంగా తీసుకురావాలను వేడుకుంటున్నా.

తండ్రి అనుమానాలు..
సోని కిడ్నాప్‌ వ్యవహారంలో ఆమె తండ్రి యాదగిరిపై  మీద కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బుల కోసం యాదగిరి సోనిని అమ్మేశాడని, . పక్కా ప్లాన్‌తోనే జూలై 1న మాల్‌ మల్లేపల్లి నుంచి యాదగిరి బొంగుళూరుకు నివాసం మార్చినట్టు సందేహాలు వ్యక్తమతున్నాయి. కిడ్నాపర్‌ రవిశంకర్‌తో కలిసే యాదగిరి ఈ ప్లాన్‌ వేసినట్టు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్ మత్తు బిస్కెట్ ఇచ్చాడనని యాదగిరి చెప్పడం అబద్దంగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు ఉండటంతో పోషణ భారమై యాదగిరి ఈ పథకం వేశాడమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు