వాన..వడగళ్లు..

2 Apr, 2018 02:28 IST|Sakshi
ఆదివారం నగరంలో కురిసిన భారీ వర్షానికి సీతాఫల్‌మండీలో నీట మునిగిన ద్విచక్ర వాహనాలు

ఉరుములు, ఈదురుగాలుల బీభత్సం

గాలుల ధాటికి తెగిపడిన విద్యుత్‌ తీగలు

150 ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

పలుచోట్ల రోడ్డుపై నిలిచిన నీరు.. ట్రాఫిక్‌ జామ్‌

నేడూ వడగండ్ల వాన కురిసే అవకాశం

హెచ్చరించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

సాక్షి, హైదరాబాద్ ‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల దెబ్బకు పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడి విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో 150 ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు కొన్ని గంటలపాటు అంతరాయం కలిగింది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, రామంతాపూర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, పంజగుట్ట, బేగంపేట, ప్యాట్నీ, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, ఈసీఐఎల్, కాప్రా, ఏఎస్‌రావునగర్, నాచారం, చర్లపల్లి, ముషీరాబాద్, అశోక్‌నగర్, లాలాపేట్, చిలకలగూడ, వారాసిగూడ, సీతాఫల్‌మండీ, పార్శిగుట్ట, మారేడుపల్లి, తుకారాంగేట్, కార్ఖానా, బోయిన్‌పల్లి, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అర్ధగంటకు పైగా వర్షం కురవడంతో పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచింది. అక్కడక్కడ ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షంతో గ్రేటర్‌ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరవాసులకు ఎండవేడిమి, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం కలిగింది.

నిలిచిన విద్యుత్‌ సరఫరా
ఈదురుగాలులు, వడగళ్ల వానతో హబ్సిగూడ, తార్నాక, ఉప్పల్, హయత్‌నగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, మెహదీపట్నం, కూకట్‌పల్లి, మియాపూర్‌ తదితర ప్రాతాల్లో కొన్ని గంటలపాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వడగండ్ల వాన కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. ఆదివారం నగరంలో గరిష్టంగా 38.7 డిగ్రీలు, కనిష్టంగా 25.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.

రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్‌లో కురిసిన వర్షపాతం
ప్రాంతం           వర్షపాతం
ముషీరాబాద్‌    2.7 సెం.మీ
అంబర్‌పేట్‌        1.7 సెం.మీ.
మౌలాలి         1.3 సెం.మీ.
బేగంపేట్‌         6.3 మి.మీ.
ఎల్బీనగర్‌        3.5 మి.మీ.
బండ్లగూడ        6 మి.మీ.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒంటరి కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు తీవ్రం

ఒక్క క్లిక్‌తో..

కాలు ఆగట్లే!

ఎర్రగడ్డ ఆస్పత్రికి పోటెత్తిన రోగులు

జనగామలో హైఅలర్ట్‌..

సినిమా

అమలాపాల్‌ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు