ఆ పోస్టులను భర్తీ చేయాల్సిందే

9 Nov, 2019 03:22 IST|Sakshi

లోకాయుక్త, హెచ్‌ఆర్సీ చైర్మన్‌ పోస్టులపై హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర లోకాయుక్త, ఉప లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ) చైర్మన్, సభ్యుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. హెచ్‌ఆర్సీ, లోకాయు క్తల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. హక్కుల కమిషన్‌ చైర్మన్, సభ్యుల నియామకాలతోపాటు లోకాయుక్త, ఉప లోకాయుక్త పోస్టులను భర్తీ చేసి తీరాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ప్రభుత్వాని కి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఖమ్మం జిల్లా, లెనిన్‌ నగర్‌కు చెందిన వెంకన్న ఈ పిల్‌ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు