ఇంట్లో నిఘా

15 Sep, 2014 04:03 IST|Sakshi
ఇంట్లో నిఘా

- రఘునాథపల్లి ఘటనతో అప్రమత్తమైన ప్రజలు
- పోలీసుల సూచనలతో జాగ్రత్త చర్యలు
- సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం
నర్సంపేట :
జిల్లాలో జరుగుతున్న చోరీలు, దోపిడీలు పోలీసులకు సవాల్‌గా మారాయి. రఘునాథపల్లిలో దొంగలు దోపిడీ చేయడమేగాక ముగ్గురిని హత్య చేసిన సంఘటన రాష్ట్రస్థాయిలో సంచలనం సృష్టించింది.ఈ ఘటన తర్వాత జిల్లా ప్రజల్లో భయాందోళన మొదలైంది. దొంగల భయంతో కంటి మీద కునుకు లేకుండాపోతోంది. దుకాణ సముదాయాలు, నివాసాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు పదేపదే చెబుతున్నా... వ్యాపారులు, బడా వ్యక్తులు ఇన్నాళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రఘనాథపల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో పలువురు సొంత నిఘాపై దృష్టిసారించారు. సీసీ కెమెరాల ఏర్పాటు  చేసుకుంటే దొంగలను గుర్తించడంతోపాటు చోరీ జరిగిన సొత్తు రికవరీ అయ్యే అవకాశం ఉండడం తో.. ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. కొందరు బడా వ్యక్తులు ఇంట్లో, దుకాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
 
అందుబాటులోకి నిఘా నేత్రాలు..
లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకుంటున్న వారు రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. సుమారు రూ.20 వేలు వెచ్చిస్తే వుూడు కెమెరాల తో నిఘా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటం తో ఇప్పుడిప్పుడే పలువురు కెమెరాల కొనుగోలు పై ఆసక్తి చూపుతున్నారు. నర్సంపేటలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో రెండు నెల లుగా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వారి సూచనలతో చాలావుంది గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాలతోపాటు ఇంటి తలుపులను తాకగానే మోగే అలారం, విద్యుత్తు ఫెన్సింగ్‌నూ ఏర్పాటు చేసుకుంటే వుంచిదని.. తద్వారా 50 శాతం మేర చోరీలు తగ్గుతాయుని పోలీసులు సూచిస్తున్నారు.
 
అంతర్ జిల్లా ముఠా సంచరిస్తోందా.. ?
జిల్లాలో చిన్నచిన్న దొంగతనాలు సాధారణం కా గా రెండు రోజుల క్రితం రఘునాథపల్లిలో హోటల్‌లో జరిగిన సంఘటనలో ముగ్గురి ప్రాణాలు కోల్పోవడం చూస్తే పార్థీ ముఠా సంచరిస్తున్నట్లు అనువూనాలు కలుగుతున్నాయి. ఈ హోటల్ యజమాని నర్సింహులు తండ్రి చనిపోవడంతో గురువారం జరిగిన ఐదో రోజు కార్యక్రమానికి కుటుంబీకులంతా తాళం వేసి రఘునాథపల్లిలోని ఇంటికి వెళ్లిపోయారు. రాత్రయ్యాక హోటల్‌కు చేరుకున్నారు. అయితే దోపిడీ దొంగలు పగలు హోటల్‌కు తాళం వేసి ఉండడం చూసి దోపిడీకి వ చ్చి ఉంటారని, లోపల వృద్ధులు, చిన్నారులు ఉండడంతో దాడికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది. దీన్నిబట్టి పగలు రెక్కీ నిర్వహించి రాత్రి దోపిడీకి పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది.

మరిన్ని వార్తలు