వివాదానికి తెర

21 Jul, 2014 03:41 IST|Sakshi

 సుభాష్‌నగర్: కొంత కాలంగా జిల్లా కేంద్రంలోగల ఈద్గా స్థలంపై నెలకొన్న వివాదానికి తెరపడింది. నగరంలోని శాంతినగర్ వద్ద గల పాత ఈద్గాకు చెందిన రెండు ఎకరాల 31గుంటల స్థలం విషయం  కొంత కాలం గా వివాదంలో ఉంది. ఈ స్థలాన్ని  కొందరు ఆక్రమించారని పలు ఆరోపణలు వెల్లు వెత్తాయి. దీంతో  గత 40 సంవత్సరాలుగా  ఈ సమస్య సమస్యగానే మిగిలి పోయింది.  పరిష్కారానికి నోచుకోలేదు. రానురాను ఈద్గా స్థలం తగ్గిపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయంపై ఎన్నోసార్లు సర్వేలు చేయాలని కొందరు, సర్వేలను నిలిపి వేయాలని మరి కొందరు ఆందోళన లు చేశారు.  

దీంతో ఆ స్థలం విషయంలో ఎ న్నోసార్లు సర్వేల కోసం అధికారులకు దరఖాస్తు చేసినా ఫలితం దక్కలేదు.అయినప్పటికీ ఈద్గాకు చెందిన స్థల వివాదం సమసిపోలేదు.  అయితే నగరానికి చెందిన ఇద్రీస్ అనే వ్యాపారి ఈద్గా పక్కన గల లక్షల వి లువ చేసే  భూమిని కొనుగోలు చేసి ఈద్గా కోసం అప్పగించారు. స్థలంతో పాటు కొ త్తగా మినార్లు  సైతం తన సొంత డబ్బులతో  నిర్మించి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. అందు కోసం లక్షల రూపాయలు  వెచ్చించి ఉదారంగా ఇచ్చిన ఘనతను దక్కించుకున్నారు.

రంజాన్ పండుగకు సన్నాహాలు
ఈద్గాలో ప్రస్తుతం నూతనంగా మినార్లను నిర్మించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రంజాన్ పండుగ సమీపిస్తుండడంతో పనులను వేగవంతం చేసి,  పండుగను కొత్త స్థలంలో జరుపుకోవడానికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం కావలసిన సౌకర్యాలను, సహకారాన్ని  కూడా నిజామాబాద్ ఎంపీ కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తలు అందిస్తున్నారు.
వివాదాలు ఉండకూడదు. ముస్లింసోదరులు రంజాన్,బక్రీద్ పండుగల సమయంలో నమాజ్ చేసే ఈద్గా స్థలం వివాదం కాకూడదు.  అందు కోసం నేను, నా  వ్యాపార మిత్రులు సోహెల్‌లు కలసి వివాదానికి తెరదించాలని భావించాము. దీంతో కబ్జాకు గురైన ఈద్గా స్థలాన్ని కొనుగోలు చేసి ఈద్గా పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. దీంతో గత కొంత కాలంగా ఉన్న ఈద్గా స్థల వివాదం సమసిపోయింది.           -ఇద్రిస్‌ఖాన్, వ్యాపారి

మరిన్ని వార్తలు