ప్రాజెక్టులు పూర్తయితే రైతుల్లో హర్షం

4 Feb, 2019 01:29 IST|Sakshi

అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే రైతు లు వర్షం కోసం ఆకాశానికి చూడాల్సిన అవసరం ఉండదని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం లోటస్‌పాండ్‌లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ సుస్థిర వ్యవసాయంపై రాసిన వ్యాసా ల సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే రైతుల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. తెలంగాణలో గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు ధాన్యం పండిందని తెలిపారు.

రైతుల కష్టసుఖాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ రెండు పథకాలు ప్రపంచ గుర్తిం పు పొందాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతతో విదేశాల్లో ఉన్న యువకులు కూడా ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. త్వరలో లక్షా 25 వేల ఎకరాల్లో రెండు పం టలకు సాగునీరు అందించబోతున్నామని తెలిపారు.

రమేశ్‌ ఈ పుస్తకంలో చేసిన సలహాలు, సూచనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పా రు. వ్యవసాయం సుస్థిరంగా సాగాలంటే పర్యావరణ సహకారం అవసరమని పుస్తక రచయిత చెన్నమనేని రమేష్‌ అభిప్రాయపడ్డారు. సుస్థిర వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్‌ కుమార్, శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్, రైతుసమన్వయ సమితి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అజయ్‌కల్లం, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శునకాలకు వింతరోగాలు

నేటి ముఖ్యాంశాలు..

కోర్టులకు వేసవి సెలవులు రద్దు

జన.. ఘన..నగరాలు!

నిమ్స్‌ ఓపీ సేవలు షురూ

సినిమా

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి

రియల్‌ 'హీరో'ల్‌

నిఖిల్‌ పెళ్లి ఈ నెల 17నే

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం