కరోనా కట్టడికి ఐఐటీ హైదరాబాద్‌ ప్రత్యేక శానిటైజర్‌!

18 Mar, 2020 14:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభణ నేపథ్యంలో మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఇంటా బయటా... ఆఫీసుల్లో ఇలా ఎక్కడ చూసినా వీటి వాడకం బాగా పెరిగిపోయింది. ఇక డిమాండ్‌ పెరిగితే ధరలు కూడా ‘పెరుగుతాయన్న’ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెడికల్‌ షాపు యజమానులు చెప్పినంత ధర పెట్టి వీటిని కొనలేని వారు వివిధ మాధ్యమాల సహాయంతో ఇంట్లోనే వీటిని తయారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ ఐఐటీకి చెందిన విద్యార్థులు ప్రత్యేక హ్యాండ్‌ శానిటైజర్‌ను తయారు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ) ప్రమాణాలతో సరికొత్త శానిటైజర్‌ను తమ కాలేజీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. (హోటల్‌లో క్వారంటైన్‌కు రూ.3,100 అద్దె)

రీసెర్చ్‌ స్కాలర్‌ శివకళ్యాణి ఆడెపు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ముద్రికా ఖండేల్‌వాల్‌ సంయుక్తంగా దీనిని తయారు చేశారు. 70 శాతం ఐసోప్రొపనాల్‌తో పాటు గ్లిజరాల్‌, చిక్కదనం కోసం పాలిప్రొపైలీన్‌ గ్లైకాల్‌.. మైక్రోబాక్టీరియాను అంతమొందించేందుకు లెమన్‌గ్రాస్‌ ఆయిల్‌.. ఐపీఏ ద్రావణం ఉపయోగించి ఈ శానిటైజర్‌ను రూపొందించినట్లు వారు పేర్కొన్నారు. ఇక ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌ వాడిన 30 సెకన్లలోనే చెడు బాక్టీరియా, ఫంగీ నుంచి విముక్తి లభిస్తుందని.. ఏకకణ జీవుల మీద 70 శాతం ఆల్కహాల్‌ పోసినట్లయితే... అవి పూర్తిగా నాశనమవుతాయని తెలిపారు. దీంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని వెల్లడించారు.(తెలంగాణలో మరో కరోనా పాజిటివ్‌ కేసు

మరిన్ని వార్తలు