అటవీ సంరక్షణలో ఝా సేవలు భేష్‌

1 Aug, 2019 02:49 IST|Sakshi

అభినందించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

పీసీసీఎఫ్‌గా పదవీ విరమణ చేసిన పీకే ఝా

వీడ్కోలు సభలో పాల్గొన్న సీఎస్‌ జోషి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అటవీ భూముల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు పీసీసీఎఫ్‌ ప్రశాంత్‌కుమార్‌ ఝా ఎంతో కృషి చేశారని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రశంసించారు. ఝా పదవీ విరమణ సందర్భంగా బుధవారం అరణ్యభవన్‌లో ఏర్పాటుచేసిన వీడ్కోలు సభకు మంత్రి ఇంద్రకరణ్, సీఎస్‌ ఎస్కే జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పీకే ఝాకు మంత్రి, సీఎస్, ఇతర అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. కొత్త పీసీసీఎఫ్‌(ఇన్‌చార్జ్‌) ఆర్‌.శోభకు అభినందనలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ మూడేళ్లకుపైగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి హోదాలో పనిచేసిన అతి కొద్ది మం ది ఐఎఫ్‌ఎస్‌లలో ఝా ఒకరని అన్నారు. అటవీ సంరక్షణ విషయంలో ఆయన అంకితభావంతో పని చేశారని కొనియాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరంతోసహా అనేక ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతులు రికార్డు వేగంతో సాధించేలా తన బృందంతో కలిసి కృషి చేశారని చెప్పారు. హరితహారం సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించారన్నారు. పీకే ఝా సేవల వల్ల అటవీ శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఇదేస్ఫూర్తితో హరితహారం, అటవీరక్షణకు అటవీ అధికారులు కృషి కొనసాగించాలని సూచించారు. ఝా నేతృత్వంలో అటవీ శాఖ సమర్ధవంతంగా పనిచేసిందని సీఎస్‌ ఎస్‌కే జోషి అన్నారు.రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల శివార్లలోని అటవీ భూముల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసిం చారు. పీకే ఝా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సహకారం వల్లే తాను విజయవంతంగా పనిచేయగలిగానని, çసహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ పృథ్వీరాజ్, అడిషనల్‌ పీసీసీఎఫ్‌లు మునీంద్ర, డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఫర్గేన్‌ లోకేష్‌ జైస్వాల్, సీఎఫ్‌వోలు, డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దక్షిణాదిలో తొలి మహిళ...

అభయారణ్యంలో ఎన్‌కౌంటర్‌

క్యూనెట్‌ బాధితుడు అరవింద్‌ ఆత్మహత్య

ఆర్టీఏ..ఈజీయే!

కరువుదీర... జీవధార

మరో ఘట్టం ఆవిష్కృతం 

విపక్షాలకు సమస్యలే కరువయ్యాయి

గాంధీభవన్‌కు ఇక టులెట్‌ బోర్డే

నయీమ్‌ కేసు ఏమైంది?

విద్యుత్‌ బిల్లు చెల్లించకపోతే వేటే!

ఖమ్మంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ ప్రారంభం

నీటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది

ఈనాటి ముఖ్యాంశాలు

మంత్రివర్గ విస్తరణ గురించి తెలియదు : కేటీఆర్‌

కానిస్టేబుల్‌ దుశ్చర్యపై స్పందించిన ఝా

చచ్చిపోతాననుకున్నా : పోసాని

‘బీసీ ఓవర్సీస్‌’కు దరఖాస్తుల ఆహ్వానం

దేశానికి ఆదర్శంగా ఇందూరు యువత

విద్యార్థినిపై పోలీసు వికృత చర్య..

ఉద్రిక్తంగా గుండాల అటవీ ప్రాంతం

దొంగతనానికి వచ్చాడు.. మరణించాడు

తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న గుండాల

పాస్‌బుక్స్‌ లేకుండానే రిజిస్ట్రేషన్‌!

పరిటాల శ్రీరామ్‌ తనకు కజిన్‌ అంటూ..

ప్రగతి నగర్‌ సమీపంలో చిరుత సంచారం

తాళం వేసిన ఇంట్లో చోరీ

హీ ఈజ్‌ కింగ్‌ ఇన్‌ 'వెంట్రిలాక్విజం'

'మొక్కలను సంరక్షిస్తే రూ. లక్ష నజరానా'

ఆ దుర్ఘటన జరిగి 11 ఏళ్లయింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాస్ట్యూమ్‌ పడితే చాలు

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

మనీషా మస్కా

సాహో: ది గేమ్‌

రాక్షసుడు నా తొలి సినిమా!

జనగణమన ఎవరు పాడతారు?