రేపటి నుంచి జల్‌మంథన్‌

27 Jul, 2017 01:18 IST|Sakshi

పీఎంకేఎస్‌వై ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై చర్చలు
సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని వివిధ నదీ బేసిన్‌ల పరిధిలో చేపట్టిన సాగునీటి ప్రాజె క్టులు, వాటికి అందిస్తున్న కేంద్ర నిధులు, వాటి పురోగతి అంశాలపై చర్చించేందుకు కేంద్రం జలవనరుల శాఖ ఈ నెల 28 నుంచి రెండ్రోజుల పాటు నాలుగో జల్‌మంథన్‌ నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో తొలిరోజు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద చేపట్టిన ప్రాజెక్టులు, రెండో రోజు నదుల అనుసంధానంపై చర్చ జరగనుంది. ఈ సదస్సుల్లో పీఎంకేఎస్‌వై సభ్యుడైన నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పాల్గొననున్నారు. పీఎంకేఎస్‌వై కింద దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులను గుర్తించి వాటికి కేంద్రం వివిధ పథకాల నుంచి నిధులు మంజూరు చేస్తోంది.

ఇందులో రాష్ట్రం నుంచి మొత్తం 11 ప్రాజెక్టులున్నాయి. వీటికి సంబంధించి నిధులు విడుదల కావల్సి ఉంది. వీటిపై సదస్సుల్లో మంత్రి స్పష్టత కోరే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 185 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.45వేల కోట్లతో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలన్న సిఫార్సులు, వీటితో పాటే ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం–వినియోగం మధ్య వ్యత్యాసం తగ్గించడం తదితర అంశాలపై చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు