తెలంగాణ తొలి సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

1 Jan, 2019 08:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేపించారు.  ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. 

కేరళలోని కొల్లాంలో 1959, ఏప్రిల్‌ 29న రాధాకృష్ణన్ జన్మించారు. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. కర్ణాటకలోని కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌ లా కాలేజీ నుంచి లాయర్‌ పట్టా సాధించారు. తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. సివిల్‌ లాయర్‌గా పేరుగాంచిన రాధాకృష్ణన్ రెండుసార్లు కేరళ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. గతేడాది మార్చి 18న ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో హైదరాబాద్‌లోని హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా కొనసాగనుంది. దీనికి చీఫ్‌ జస్టిస్‌గా రాధాకృష్ణన్‌ను కొనసాగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కాగా, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ రాధాకృష్ణన్ చేతుల మీదుగా 12మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. 

ప్రమాణ స్వీకారం చేసిన న్యాయమూర్తులు 


1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్


2. జస్టిస్ మామిడాల సత్యరత్న శ్రీ రామచంద్ర రావు


3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి


4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావ్


5. జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి


6. జస్టిస్ బులుసు శివ శంకర్ రావు


7. జస్టిస్ డా. షమీమ్ అఖ్తర్


8. జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు


9. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి


10. జస్టిస్ తోడుపునూరి అమర్నాథ్ గౌడ్


11. జస్టిస్ వి రామ సుబ్రహ్మణ్యన్ 


12.ఆర్ ఎస్ చౌహన్

>
మరిన్ని వార్తలు