తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ శ్రీదేవి ప్రమాణ స్వీకారం

15 May, 2019 11:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ గండికోట శ్రీదేవి ప్రమాణస్వీకారం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ చేతుల మీదుగా బుధవారం ఉదయం ఆమె బాధ్యతలు చేపట్టారు. శ్రీ దేవి బదిలీకి ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన జస్టిస్ శ్రీదేవి.. ఉత్తర్‌ప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్‌కు అఖిలభారత కోటాలో ఎంపికయ్యారు. అక్కడే వివిధహోదాల్లో పనిచేసి అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు.

ఘాజియాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత 2018లో అలహాబాద్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇటీవల ఆమె తనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని అలహాబాద్‌ హైకోర్టు సీజే ద్వారా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం, ఆమెను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆ మేర కేంద్రానికి సిఫారసు చేసింది.


 

మరిన్ని వార్తలు