కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

24 Nov, 2019 03:27 IST|Sakshi

ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం

కేంద్ర హోంశా సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులను ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేం ద్రం తరఫున కేసీఆర్‌ను కోరుతున్నామన్నారు. మన కార్మికులు, తెలంగాణ బిడ్డలు అన్న దృక్పథంతో సీఎం వ్యవహరించాలని కోరారు. శనివారం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిస్తూ, ఆర్టీసీ సమ్మె పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాల్సి ఉందని, ఆర్టీసీ కార్మికులంతా తెలంగాణ బిడ్డలన్న ఆలోచనను సీఎం కేసీఆర్‌ చేయాల్సి ఉందన్నారు. సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేయడం పట్ల కార్మికులను అభినందిస్తున్నట్లు చెప్పారు. కాగా, వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ను పాకిస్తాన్‌ నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు