కేటీఆర్‌ పర్యటనకు ఏర్పాట్లు

12 Jun, 2020 13:49 IST|Sakshi
భద్రకాళి బండ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్, కమిషనర్, ఎమ్మెల్యే

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సర్వం సిద్ధం

నగరంలో పర్యటించిన కలెక్టర్, కమిషనర్, చీఫ్‌ విప్, ఎమ్మెల్యే

త్వరలో మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ నగర పర్యటనకు రానున్నందున అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు కలెక్టర్, గ్రేటర్‌ కమిషనర్‌తో పాటు ప్రజాప్రతినిధులు పలుప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.

వరంగల్‌ అర్బన్‌ : త్వరలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనుండగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా వరంగల్‌ ఇసుక అడ్డాల వద్ద ఫ్‌లై ఓవర్, భద్రకాళి బండ్, బల్దియా ప్రధాన కార్యాల యం ఎదురుగా పోతన విగ్రహం, సెంట్రల్‌ జైలు నర్సరీ పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు గురువారం పరిశీ లించారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాట్లను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, కమిషనర్‌ పమేలా సత్పతి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుండు సుధారాణి పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. మంత్రి పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయడంపై చర్చించారు.

ఆక్సిజన్‌ పార్కు పనుల పరిశీలన
మడికొండ : రాంపూర్‌ స్టేషన్‌ పెండ్యాలలో ‘కుడా’ ఆధ్వర్యా న రూ.4కోట్ల వ్యయంతో ఏర్పాటుచేస్తున్న ఆక్సిజన్‌ పార్కు కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్న దృష్ట్యా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, గ్రేటర్‌ కమిషనర్‌ సత్పతి పరిశీలించారు. పార్కు ప్రదేశంలో ముళ్లపొదలు తొలగించాలని, గుంతలు పూడ్చాలని ఆదేశించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం..
కాజీపేట: కాజీపేటలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాన్ని చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, కమిషనర్‌ సత్పతితో కలిసి కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పరి శీలించారు. కడిపికొండ శివారు 55వ సర్వే నంబర్‌లో ఖాళీ గా ఉన్న స్థలంలో దాదాపు వంద మందికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించడానికి స్థలం అనువుగా ఉందని గుర్తించారు.

సీవరేజీ ప్లాంట్‌ స్థల పరిశీలన
కరీమాబాద్‌ : వరంగల్‌ ఉర్సు బైపాస్‌రోడ్‌లోని ప్రభుత్వ స్థలంలో 5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో సీవరేజీ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కమిషనర్‌ పమేలా సత్పతి పరిశీలించారు. మంత్రి కేటీఆర్‌ పర్యటనలో భాగంగా ప్లాంట్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమాల్లో ‘కుడా’ పీఓ అజిత్‌ రెడ్డి, ఆర్‌డీఓ వెంకారెడ్డి, ఈఈలు భీంరావు, రాజం, విద్యాసాగర్, డీఈ రవీందర్, మున్సిపల్‌ ఎస్‌సీ భాస్కర్‌రెడ్డి, ఎంహెచ్‌ఓ రాజా రెడ్డి, ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు శ్రీనివాసరావు, తహసీల్దార్‌ కిరణ్‌ప్రకాష్, భూగర్భ జల వనరుల శాఖ డీడీ రాజరెడ్డి, కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్, గట్టు రమణ, మేడిది మధు, రజిత సురేష్, వాసు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు