సుష్మ మరణంపై పాకిస్తానీల పిచ్చికామెంట్లు

8 Aug, 2019 01:44 IST|Sakshi

తిప్పికొట్టిన కేటీఆర్, కరుణాగోపాల్‌

సాక్షి, హైదరాబాద్‌ : కశ్మీర్‌ విభజన అంశం ట్వీట్ల వార్‌కు దారి తీస్తోంది. ఈ విభజనను వ్యతిరేకించే పాకిస్తానీలు భారత నాయకులపై ట్వీట్ల రూపంలో ద్వేషాన్ని చిమ్ముతున్నారు. వారి కామెంట్లు మన నాయకులకు ట్యాగ్‌ చేస్తూ తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. తాజాగా పలువురు పాక్‌ నెటిజన్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారకరామారావు, బీజేపీ నాయకురాలు కరుణాగోపాల్‌ను తమ ట్వీట్లతో విసిగించాలని చూసి భంగపాటుకు గురయ్యారు. షోయబ్‌ అన్సారీ అనే పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ సానుభూతిపరుడు కశ్మీర్‌ను విభజించిన పాపం.. కేంద్రానికి తగిలింది అందుకే, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఆకస్మికంగా మరణించారంటూ ట్వీట్‌ చేస్తూ శాపనార్థాలు పెట్టాడు. దీనికి కేటీఆర్‌ కూడా దీటుగానే స్పందించారు.

‘ఒక నాయకురాలి మరణంపై ఇంత దారుణంగా స్పందించిన మీ సంకుచిత మనస్తత్వం మీ ట్వీట్లతో బయటపడింది. నువ్వు పాకిస్తాన్‌కు చెందిన వాడివైనా సరే.. జీవితాంతం ప్రజాసేవకు పాటుపడ్డ సుష్మాస్వరాజ్‌ లాంటి వారిని చూసి కాస్త ధైర్యం, మర్యాద, హుందాతనం నేర్చుకో..’అంటూ చురకలంటించారు. నాజియా అనే మరో నెటిజన్‌ దేవుడి దయ వల్ల సుష్మాస్వరాజ్‌ ఇప్పటికే నరకంలోకి వెళ్లి ఉంటుంది, తర్వాత వంతు నరేంద్రమోదీదే అంటూ బీజేపీ నాయకురాలు కరుణాగోపాల్‌ను వెక్కిరిస్తూ ట్యాగ్‌ చేసింది. దీనికి కరుణాగోపాల్‌ కూడా అదేస్థాయిలో సమాధానమిచ్చింది. మీలాంటి మనస్తత్వం ఉన్న వారు ఎన్నటికీ మారరు అంటూ ప్రతిస్పందించి ఆమె నోరు మూయించింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏది మాస్టర్‌ప్లాన్‌ : హైకోర్ట్‌

‘నిట్‌’ విద్యార్థి ఆత్మహత్య 

5జీ.. క్రేజీ..

నాలుగు జెడ్పీలకు పాలకమండళ్లు

ఇంజన్‌ నుంచే కరెంట్‌..!

వచ్చేస్తోంది జల‘సాగరం’

ఎంబీబీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ నిలిపివేత 

హైదరాబాద్‌లో లేకున్నా.. చేనేతనే కట్టుకున్నా!

యువతలో ధైర్యం నింపిన నాయకురాలు

చెట్లతో చిప్కో.. కష్టాలు చెప్కో.. 

సమైక్య ఉద్యమం 

ఈనాటి ముఖ్యాంశాలు

గల్ఫ్ శవ పేటికలపై అంబులెన్స్‌ సంస్థల దోపిడీ

‘రాజ్యాధికారంతో బీసీల సాధికారత’

ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు

ఎంపీ, ఎమ్మెల్యేలనే బురిడీ కొట్టించిన కేటుగాడు..!

ఉమ్మడి వరంగల్‌ను ముంచెత్తుతున్న వానలు

తప్పు చేస్తే ఎవరినీ వదలం: ఎర్రబెల్లి

ఉప్పొంగి ప్రవహిస్తున్న జంపన్న వాగు

చేనేతకు సలాం

వరదలో చిక్కుకున్న 40 మంది కూలీలు

అదే గిఫ్ట్‌ కావాలి..

ఆదిలోనే ఆటంకం

'ర్యాగింగ్‌ చేస్తే ఇంటికే’

ఒక బైక్‌.. 42 చలానాలు

అనారోగ్యంతో పెద్ద పులి మృతి

నడవాలంటే నరకమే..!

వెండితెరపై చేనేత కార్మికుడి విజయగాథ

బేఖాతర్‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదో బోరింగ్‌ టాపిక్‌

తోట బావి వద్ద...

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!

సెప్టెంబర్‌లో సాహసం

ఇంటి ఖరీదు 140 కోట్లు

డబ్బుతో కొనలేనిది డబ్బొక్కటే