పార్కింగ్‌ స్థలాలను తలపిస్తున్న ఠాణాలు

21 Apr, 2020 11:23 IST|Sakshi
నగరంలోని పోలీస్‌ స్టేషన్ల నుంచి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు తరలించిన వాహనాలు

సాక్షి, ఖమ్మం : లాక్‌డౌన్‌ మరింత కఠినతరం అవుతున్నా నిబంధనలు ఉల్లంఘిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. ఆ వాహనాలతో పోలీస్‌ స్టేషన్లు నిండిపోతున్నాయి. ఖమ్మం నగరంలో అయితే నాలుగు పోలీస్‌స్టేషన్లు వాహనాలతో నిండిపోవటంతో స్టేషన్లను పరిశీలించిన ఖమ్మం సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ వీటిని ప్రకాష్‌ నగర్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు ‘సిటిజన్‌ ట్రాకింగ్‌ మాప్‌ ఫర్‌ కోవిడ్‌’ అనే అప్లికేషన్‌ను అమలులోకి తెచ్చినా పరిస్థితి అదుపులోకి రావటం లేదని తెలుస్తోంది. (గౌస్ మరణంపై ఏపీ పోలీస్ ట్వీట్ )

దయచేసి సహకరించండి
కరోనా నియంత్రణకు ప్రజలకు పూర్తిగా సహకరించాలి. అత్యవసరమైతే తప్ప, అకారణంగా రోడ్లపైకి రావద్దు. ఒక్కసారి వాహనం సీజ్‌ అయితే లాక్‌డౌన్‌ ముగిసేంతవరకు వాహనం బయటకురాదు. ఆ తర్వాత కోర్టులో విధించే జరిమానా కట్టుకోవాలి. ఇన్ని ఇబ్బందులు పడేకన్నా వాహనదారులు ఇంట్లోనే ఉండటం మంచిది. (బాలయ్య, చిరులకు ఎన్టీఆర్‌ చాలెంజ్)
– శ్రీధర్‌ త్రీటౌన్‌ సీఐ

మరిన్ని వార్తలు