ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి బైఠాయింపు

13 Feb, 2019 08:01 IST|Sakshi
ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన స్వప్న

పరారీలో ప్రియుడి కుటుంబం

కోటపల్లి(చెన్నూర్‌): ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయించింది. కోటపల్లి మండలంలోని పుల్లగామ గ్రామంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. పుల్లగామకు చెందిన నిమ్మల స్వప్న, అదే గ్రామానికి చెందిన ఎతం సమ్మయ్య గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. స్వప్న, సమ్మయ్యది వేర్వేరు కులాలు. స్వప్న అన్నయ్య స్నేహితుడు కావడంతో సమ్మయ్య నిత్యం ఇంటికి వచ్చే వాడు.

ఈ క్రమంలో స్వప్న, సమ్మయ్య మధ్య ప్రేమ చిగురించింది. ఇటీవల స్వప్న పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ప్రియుడు సమ్మయ్య నిరాకరించాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ స్వప్న మంగళవారం సమ్మయ్య ఇంటి ఎదుట పురుగల మందు డబ్బాతో బైఠాయించింది. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ ప్రేమ పేరుతో సమ్మయ్య తనను లొంగదీసుకున్నాడని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని పేర్కొంది. స్వప్నకు తెలంగాణ రజక సంఘం నాయకులు మద్దతు తెలిపారు. స్వప్నకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల మధుకర్‌ తెలిపారు. కాగా ప్రియుడు సమ్మయ్యతో పాటు కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు