బీసీలూ.. చంద్రబాబు మాయలో పడకండి

13 Feb, 2019 08:08 IST|Sakshi
చింతలపూడిలో జరిగిన బీసీ సదస్సులో మాట్లాడుతున్న ఆళ్ల నాని

వైఎస్సార్‌ సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని

పశ్చిమగోదావరి, చింతలపూడి: చంద్రబాబు మాయలో మరోసారి పడవద్దని ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) బీసీలకు సూచిం చారు. చింతలపూడిలో మంగళవారం నియోజకవర్గ బీసీ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆళ్ల నాని మాట్లాడుతూ చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప నాలుగున్నర  ఏళ్లుగా బీసీల సంక్షే మం గురించి పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆదరణ పథకం పెట్టి ఇస్త్రీ పెట్టెలు, కు ట్టుమెషీన్లు ఇస్తే బీసీల స్థితిగతులు మారవన్నారు. నాణ్యత లేని పనిముట్లు  ఇచ్చి బీసీలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఓట్లువేసి అధికారంలో కూర్చోబెట్టిన బీసీలకు చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. దివంగత నేత  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు.  ఫీజురీయింబర్స్‌మెం ట్‌ పథకం ద్వారా బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు వైఎస్సార్‌ కృషిచేశారన్నారు.

బీసీ గర్జనను జయప్రదం చేయాలి
ఏలూరులో ఈనెల 17న జరిగే బీసీ గర్జనను జయప్రదం చేయాలని ఆళ్ల నాని పిలుపునిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి బీసీలు గర్జనకు తరలివస్తున్నారని చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా బీసీలను అభివృద్ధి చేసే విధంగా ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  బీసీ డిక్లరేషన్‌ను సభలో ప్రకటిస్తారని తెలిపారు. నియోజకవర్గ  సమన్వయకర్త  వీఆర్‌ ఎలీజా మాట్లాడుతూ గత ఎన్నికల్లో  చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వారు చెప్పిన వారికే ఆదరణ పథకాలు అందించారని, అర్హులకు అందలేదన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మవద్దని  పిలుపునిచ్చారు. బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాద్, జిల్లా అధికార ప్రతిని«ధులు బొడ్డు వెంకటేశ్వరరావు, పోల్నాటి బాబ్జి, నాయకులు డి. నవీన్‌బాబు, వందనపు సాయిబాలపద్మ, కె.దినేష్‌రెడ్డి, ముసునూరి వెంకటేశ్వరరావు, మిడతా ర మేష్, వామిశెట్టి హరిబాబు, సోంబాబు, చిలుకూరి జ్ఞానారెడ్డి, మట్టా సురేష్, రెడ్డి బాబ్జి, కట్టా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బీసీల సత్తా చాటండి
జిల్లాలో  బీసీల సత్తాచాటాలని వైఎస్సార్‌ సీపీ ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. చింతలపూడి వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ స మన్వయకర్త వీఆర్‌ ఎలీజా అధ్యక్షతన ముఖ్య నా యకులతో సమావేశమయ్యారు. బీసీ గర్జన స భను జయప్రదం చేసేందుకు ప్రతిఒక్కరూ కష్టపడాలన్నారు. బీసీ గర్జనతో పార్టీకి బీసీల్లో ఉన్న  బలాన్ని నిరూపించాలని కోరారు. ప్రతిగ్రామం నుంచి బీసీలు అధిక సంఖ్యలో గర్జన సభకు తరలివచ్చేలా చూడాలన్నారు. 

>
మరిన్ని వార్తలు