వంటగ్యాస్‌పై రూ.3 పెంపు

30 Oct, 2014 04:12 IST|Sakshi

మహబూబ్‌నగర్ టౌన్:
 వంటగ్యాస్ వినియోగదారులపై మరోపిడు గు పడింది. పౌరసరఫరాల శాఖ సబ్సిడీపై అందజేస్తున్న డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్‌పై కేంద్రప్రభుత్వం తాజా గా రూ.3 పెంచింది. ప్రస్తుతం రూ.443.50 ఉన్న ఈ ధర రూ.447.50కి పెరిగింది. దీంతో జిల్లాలో ఉన్న వినియోగదారులపై నెలకు రూ.12.75 లక్షల చొప్పున అదనపుభారం పడుతుంది. పెరిగిన ధర ఈనెల 26వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, ఇప్పుడు వంటగ్యాస్ ధరపెంపుతో మరింత ఇబ్బంది పడనున్నారు.

జిల్లాలో 4.25లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా, వీటిలో భారత్ గ్యాస్ 2,10లక్షలు, హెచ్‌పీ 1.80లక్షలు, ఇండియన్ గ్యాస్ కనెక్షన్లు 35వేల చొప్పున ఉన్నాయి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఈ గ్యాస్ కనెక్షన్లు ఉండడంతో రీఫిల్లింగ్‌పై ఎలాంటి సమస్య లేకుండా తీసుకునేవారు. కానీ ఇటీవల గ్యాస్‌రీఫిల్లింగ్‌పై రూ.3పెంచడంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ప్రభుత్వ నిర్ణయంపై సామాన్య ప్రజానీకం మండిపడుతోంది.

మరిన్ని వార్తలు