మానసిక స్థితి బాగోలేకే నా భర్త ఆత్మహత్య

13 Apr, 2017 02:58 IST|Sakshi
మానసిక స్థితి బాగోలేకే నా భర్త ఆత్మహత్య

ఎన్‌ఆర్‌ఐ మధుకర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి వెల్లడి
కడసారి చూడనీయకుండా అంత్యక్రియల్లో దాడి చేశారు
ఆస్తి కోసమే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు
‘పోస్ట్‌మార్టం’ఆధారంగా చట్టప్రకారం ముందుకెళతాం
మాకు ప్రాణహాని ఉంది.. ప్రభుత్వం రక్షణ కల్పించాలి


హైదరాబాద్‌: మానసిక స్థితి సరిగా లేక, ఉద్యోగం పోతుందనే భయంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డా డని యాదాద్రి (భువనగిరి) జిల్లా యాదగిరిగుట్ట మండ లం రాళ్ల జనగాంకు చెందిన ఎన్‌ఆర్‌ఐ గూడూరు మధుకర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి చెప్పారు. బుధ వారం ఆర్‌కేపురం సౌభాగ్యనగర్‌లో తండ్రి నర్సింహారెడ్డితో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడేళ్ల క్రితం మధుకర్‌తో తనకు వివాహమైందని, అమెరికాలోని సియోటెల్‌ నగరంలో ఉంటూ ఇద్దరం ఉద్యోగం చేసేవారమని, తమకు ఐదేళ్ల పాప ఉం దని స్వాతిరెడ్డి చెప్పారు. సంసారంలో చిన్నచిన్న విషయాలు తప్ప, అంతా సవ్యంగానే ఉండేదని, ఇద్దరం సర్దుకుని పోయే వారమన్నారు.

ఈ మధ్యకాలంలోనే ఇల్లు కూడా కొన్నామని చెప్పారు. ఏడాది నుంచి తన భర్త మానసిక పరిస్థితి బాగోలేదని, పనిచేస్తున్న కంపెనీలో ఈ ఏడాది జూన్‌తో గడువు పూర్తవుతుందని, హెచ్‌1బి వీసా నిబంధనలు కఠినతరం కావడంతో తనకు తిరిగి ఉద్యోగం వస్తుందో రాదోననే భయం తో మానసిక ఆందోళనకు గురయ్యేవాడని ఆమె పేర్కొంది. మధుకర్‌ అక్క, బాబాయి కుమారుడు రవీందర్‌రెడ్డి తరచుగా ఫోన్‌లో ఆస్తి గురించి మాట్లాడుకునేవారని, ఈ వ్యవహారంలో కూడా ఆయన తీవ్ర మనో వేదనకు గురయ్యాడని తెలిపింది.

మనో వేదనకు సంబంధించి కొంతకాలంగా మెడి సిన్‌ వాడుతూ వైద్యుల సలహాలు పాటిస్తు న్నాడన్నారు. ఈ విషయాన్ని తన అత్తమామ లకు చెప్పినా వారు స్పందించలేదన్నారు. కొంత కాలంగా తనను కొడుతూ అప్పుడ ప్పుడూ ప్రేమగా చూసేవాడని చెప్పారు. ఈ నెల 4న తాను ఆఫీస్‌కు వెళ్లి వచ్చేసరికి మధుకర్‌ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని, దీంతో తాను షాక్‌కు గురయ్యానని స్వాతిరెడ్డి వివరించారు.

ఆస్తి కోసమే నిందారోపణలు..
సొంతూరులో తన భర్త అంత్యక్రియలు చేసేందుకు తీసుకువస్తే తనపై అత్తింటివారు అసత్య ఆరోపణలు చేసి.. మధుకర్‌ను కడసారి చూడనీయకుండా తనను, తన కుమార్తెను కట్టడి చేశారని ఆరోపించారు. తమపై దాడి చేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిం చారు. తాను తప్పు చేసి ఉంటే మధుకర్‌ మృతదేహాన్ని ఇక్కడకు ఎందుకు తీసుకువస్తానని, అమెరికా ప్రభుత్వం తనను వదిలిపెట్టేది కాదని చెప్పారు. తనకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే ముందస్తు పథకం ప్రకారం తనపై నిందారోపణలు చేస్తున్నారని, వాటిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా చట్టప్రకారం తాము ముం దుకు వెళతామని, తమపై దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవటంతో పాటు, ప్రాణహాని ఉన్నందున తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 

మరిన్ని వార్తలు