మాణికేశ్వరి మాతకు కన్నీటి నివాళి

9 Mar, 2020 10:50 IST|Sakshi
మాణికేశ్వరి మాత పార్థివదేహాన్ని దర్శించుకుంటున్న భక్తులు 

భక్తుల దర్శనార్థం సూర్యనంది క్షేత్రంలో పారి్థవదేహం

తరలివచ్చిన భక్తజనం

సందర్శించిన ప్రముఖులు

నేడు మహామందిరంలో అంతిమ సంస్కారాలు

సాక్షి, దామరగిద్ద (నారాయణపేట) : భక్తుల్తో ఆధ్యాత్మికం పుష్పాలంకరణ అనంతరం భక్తుల దర్శణార్థం క్షేత్రంలోని ప్రాధాన గోపురం ముందు ఉంచారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి కన్నీటి నివాళులర్పించారు. మొదట మూడు రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉంచాలని నిర్ణహించినా.. కర్ణాటక ప్రభుత్వ పోలీస్‌ శాఖ ఆదేశాల మేరకు.. భక్తుల రద్దీతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా సోమవారం పౌర్ణమి రోజు కావడంతో హింధూ ధర్మం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించన్నుట్లు ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు.  

ప్రముఖుల సందర్శన.. నివాళి 
కర్నాటక రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులు, మాత మాణికేశ్వరి కుటుంబ సభ్యులు అమ్మవారి పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాలలతో నివాళులర్పించారు. కర్నాటక రాష్ట్ర మంత్రి చింతంచు బాబురావ్, షేడం ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌పాటిల్, గర్మిట్కల్‌ ఎమ్మెల్యే నాగన్నగౌడ్, కర్నాటక మాజీ సీఎం మల్లికార్జున కర్గె కుమారుడు ఎమ్మెల్యే ప్రియాంక కర్డె, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, ఇతర నాయకులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.  

నేడు అంతిమ సంస్కారాలు 
సూర్యనంది క్షేత్రంలో మాత మా ణికేశ్వరి అంతిమ సంస్కారాలు సోమ వారం నిర్వహించనున్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో వేద మంత్రాల నడుమ అంతిమ సంస్కారాలు జరగ నున్నాయి. గతంలో నిర్మించిన మహామందిరంలోనే మాత అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.  

సజీవసమాధికి అనుమతి నిరాకరణ 
గత ఐదు సంవత్సరాల క్రితమే మాత సజీవ సమాధికి పూనుకున్నారు. కాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ న్యాయస్థానం సజీవ సమాధి చట్ట వ్యతిరేఖమని అనుమతి నిరాకరించింది. దీంతో అప్పటి నుంచి మాత మౌనదీక్షలు, జపధ్యానాలు, ధైవచింతన, ప్రతీ శివరాత్రికి భక్తులకు దర్శనమిస్తు తన జీవితాన్ని కొనసాగించారు.అప్పట్లో జీవసమాధి కోసం ఏర్పాటు చేసిన మహా మందిరంలోనే నేడు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.  

ఇరు రాష్ట్రాల్లో ట్రస్టులు 
మాణికేశ్వరి మాత గత కొన్ని దశాబ్దాలుగా ఇరు రాష్ట్రాల్లో పర్యటించారు. మాత భక్తులు స్వచ్ఛందంగా స్థలాలు సమకూర్చడంతో ఇరు రాష్ట్రాల్లో ఆశ్రమాలు వెలిశాయి. కర్నాటక రాష్ట్రంలోని గుల్‌బర్గా దావనగిరి బాగల్‌కోట్, లింగ్‌సూర్‌ ప్రాంతాల్లో ఆశ్రమాలు, ఆలయాలు ఉన్నాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్, శంషాబాద్‌ సమీపంలో పెద్దషాపూర్, కర్నూల్‌ జిల్లాలోని ఆత్మకూర్, శ్రీశైలం ప్రాంతాల్లోను ఆశ్రమాలు మాణికేశ్వరి ట్రస్ట్‌ పేరిట కొనసాగుతున్నట్లు సమాచారం

మరిన్ని వార్తలు