మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ

9 Mar, 2020 10:51 IST|Sakshi

న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాలో చేతిలో ఓటమి పాలైనప్పటికీ భారత జట్టుకు విశేషమైన మద్దతు లభిస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మాజీ బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్, సెహ్వాగ్‌లతో పాటు పలువురు క్రికెటర్లు అండగా నిలిచారు. ‘మహిళల క్రికెట్‌ జట్టుకు అభినందనలు. రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు వెళ్లాం( 2017లో వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ను ఉద్దేశించి). కానీ వాటిని కోల్పోయాం. ఈ రెండు మెగా టోర్నీల్లో బాగా ఆకట్టుకున్నాం. మనకు ఏదొక రోజు వస్తుంది.. జట్టుకు, ప్లేయర్స్‌కు అండగా ఉందాం’ అని గంగూలీ ట్వీట్‌ చేశాడు.  (మన వనిత... పరాజిత)

‘ప్రపంచకప్ మొత్తం మీరు పోరాడిన తీరు చూసి గర్వంగా ఉంది. మీరు పుంజుకుని మరింత బలంగా వస్తారన్న నమ్మకం నాకుంది’ అని కోహ్లి ట్వీట్ చేశాడు. ‘ కొన్ని సంవత్సరాల క్రితం మహిళల క్రికెట్‌ వైపు చూసే వారు ఉండేవారు కాదు. ఇప్పుడు లక్షల్లో అభిమానులు మహిళల క్రికెట్‌ వైపు చూస్తున్నారు. ఇది మంచి పరిణామం. క్రికెట్‌ వరల్డ్‌కప్‌లు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఈరోజు మన అమ్మాయిలు ఫైనల్‌కు చేరడం ప్రతీ ఇండియన్‌ గర్ల్‌ గర్వించే క్షణం’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. ఇక జస్‌ప్రీత్‌ బుమ్రా, మయాంక్ అగర్వాల్ కూడా భారత అమ్మాయిలపై ప్రశంసలు కురిపించారు. (కన్నీళ్లు కనిపించనీయవద్దు!)


 

మరిన్ని వార్తలు