విమోచన దినోత్సవాన ఎగిరిన జాతీయ జెండా

18 Sep, 2014 02:38 IST|Sakshi

 నిజామాబాద్ అర్బన్: తెలంగాణ విమోచన దినోత్సవం రోజున నిరసనలు వెల్లువెత్తా యి. జాతీయ జెండాను ఎగురవేసేందుకు బీజేపీ, ఏబీవీపీ ఇతర సంఘా లు పోటీపడ్డాయి. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేయడంతో పలు చోట్ల వాగ్వివాదాలు జరిగాయి. కొంతమేరకు ఉద్రిక్తత ఏర్పడింది. ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ సహా బీజేపీ నాయకులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పొట్టిశ్రీరాములు విగ్రహం
 వద్ద ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలను దాటి రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

మరోవైపు ఏబీవీపీ నాయకులు కూడా కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ప్రవేశమార్గం వద్ద పోలీసులతో వాగ్విదానికి దిగారు. మరి కొందరు ఇనుప కంచెను దాటడానికి యత్నించారు. ఇద్దరు ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్ ప్రధాన ద్వారంపైకి ఎక్కి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి పట్టణ ఒకటవ ఠాణాకు తరలించారు.

 భారీ భద్రత
 అంతకుముందే పోలీసులు కలెక్టరేట్ చుట్టు పక్కల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోకి ఎవరూ ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఏబీవీపీతోపాటు టీజీవీపీ నాయకులు కూడా కలెక్టరేట్ వద్ద జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు. టీఎన్‌జీఓస్ భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం నిర్వహించారు. మహిళా కళాశాలలో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. తపస్ ఆధ్వర్యం    లో సంఘం కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు జాతీయ జెండాను ఎగురవేశారు.

 సదస్సులు, సభలు
 బోధన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, సదస్సులు నిర్వహించారు. ఏబీ   వీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగుర వేసి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. టీజీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

నవీపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు తహశీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేశారు. రాస్తారోకో నిర్వహించారు. కోటగిరి తహశీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేస్తుండగా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఏబీవీపీ నాయకులు ర్యాలీలు తీసి, బస్టాండ్ ఎదురుగా జాతీయ జెండాను ఎగురవేశారు. బాన్సువాడలో సీపీఎం, బీజేపీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహించారు.

 మానవహారం
 నస్రుల్లాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. వర్నిలో పీడీఎస్‌యూ నాయకులు ధర్నా చేపట్టారు. ఆర్మూర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహించారు. నందిపేట తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఏబీవీపీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు.

జేఏసీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహించారు. బాల్కొండ, మద్నూరు, బిచ్కుంద, జుక్కల్ మండల కేంద్రాలలో ఏబీవీపీ, బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశా రు. ఎల్లారెడ్డిలో మండల కేంద్రంతోపాటు పలు చోట్ల జాతీయ జెండాలను ఎగురవేశారు. కామారెడ్డి ఆర్‌టీ ఓ కార్యాలయంపై ఏబీవీపీ నాయకులు జాతీయ జెం   డాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు. నిజాంసాగర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు.

 మాచారెడ్డి, భిక్కనూరు మండల కార్యాలయాల లో బీజేపీ నాయకులు జాతీయ జెండాలను ఎగురవేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ విశ్వ విద్యాలయం పరిపాలన విభాగ భవ నంపై, కళాశాల భవనంపై ఏబీవీపీ నాయకులు జా తీయ జెండాను ఎగురవేశారు. డిచ్‌పల్లి మండలం గన్నారం ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్ గ్రామస్తులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. సిరికొండలో న్యూడెమోక్రసీ నేతలు అవగాహన సదస్సు నిర్వహిం చారు.

మరిన్ని వార్తలు