పాస్‌బుక్‌లో నాలా భూములూ నమోదు

7 Mar, 2018 03:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతుల అదీనంలో ఉన్న వ్యవసాయేతర (నాలా) భూములను కూడా పక్కాగా రికార్డు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ భూములకు పెట్టుబడి సాయం పథకం అమలు నేపథ్యంలో వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లో సాయం అందకుండా చూడటంతో పాటు భవిష్యత్తులో క్రయవిక్రయ లావాదేవీలను సులభతరం చేసేందుకు నాలా భూముల వివరాలను కూడా రైతుల పాస్‌ పుస్తకంలో నమోదు చేయనున్నారు. ఇందుకోసం పాస్‌పుస్తకంలో ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలో మొత్తం 15,16,873 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నట్లు తేలింది. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2.65 లక్షల పైచిలుకు ఎకరాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు