‘‘అప్పుడెప్పుడో కాటన్దొర అని ఓ ఆసామి ఉండేవాడు. ఆయన నూరూ, నూటాయాభై ఏళ్ల కిందట కట్టిన బ్యారేజ్‌లు చెక్కుచెదర...’’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో విమర్శించబోతుంటే..రాబోతున్న గుగ్లీ బంతేమిటో తెలిసి, మధ్యలోనే దాన్ని కట్ చేస్తూ...
‘‘ఏయ్... ఎవల్లో ఎప్పుడో ఆంధ్రోల్ల కోసం, ఆంధ్ర ఏరియాల కట్టిన ప్రాజెక్టులతోని పోల్చి..తెలంగాణను తక్కువ చేస్తూ మాట్లాడతరెందుకురా?’’ అంటూ దాన్ని కవర్‌డ్రైవ్ వైపు నెట్టేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు.
‘‘అయితే తెలంగాణ గురించే మాట్లాడదాం. ఈడ హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు ప్లానిచ్చిండు. ఇక్కడి డ్రైనేజీ సిస్టమ్‌ను చక్కబెట్టడానికి అలనాడెప్పుడో మోక్షగుండం విశ్వేశ్వర...’’ మళ్లీ మధ్యలోనే మాట కట్ చేసి, మళ్లీ ఇలా చెప్పారు. ‘‘అసలు తెలంగాణ అపరభగీరథుడు కేసీఆర్ పవరేమిటో తెల్సా? అసలాయన ఉనికేందో, ఎల్లవేళలా నీళ్లల పుట్టి నీళ్లల పెరిగిన ఆ సంగతులు తెల్సా మీకు?’’
‘‘ఏందీ... నీల్లల్ల బుట్టి నీల్లల్ల పెరిగిండా? అదెట్ల?’’ చెప్పడం మొదలుపెట్టారు బీఆర్ఎస్ వారు. అదేదో సిన్మాల బాహుబలి అనేటాయన ఒక పే...ద్ద జలపాతం.. దాని ఎమ్మట్నే పారే పే...ద్ద నది ఉండే..ఆ ఊళ్ల పెరిగిండు కదా. కానీ కేసీఆర్ సార్ నిజంగనే నాలుగు మూలలల్ల నాలుగు అద్భుత తటాకాలున్న పల్లెల పుట్టి, పెరిగిండు. చింతమడక అనే ఆ ఊళ్లె... ఊరికి ఉత్తరాన పెద్ద చెరువు ఉంటె, దక్షిణాన దమ్మచెరువుంది. కొద్దిగ పెడమర్ల పడమర్ల కోమటి చెరువు! తూర్పున సింగచెరువు!! కొద్దిగ దూరంల అంకపేటల ఈశాన్యాన పెద్ద చెర్వు!!
కోమటిచెరువుల ఈదిండు. పెద్ద చెరువుల తొక్కునీల్ల కాడ దునికి కాకరాల్ల దాక పొయ్యి... అక్కడ మత్తడి దాంక ఈతగొట్టిండు. చింతచెర్వు మొత్తం ఈదిండు. దమ్మచెర్వుకింద ఒక బాయి ఉండె. దాంట్లెకు మోటచిమ్ములెక్కి దునికేది. ఎత్తు సరిపోక మర్రిచెట్టుకొమ్మలెక్కి కూడ దునికేది. అసలు వాళ్ల ఊళ్లె వాళ్లింటి పాటకు ముందునుంచే మూణ్ణెల్లు జాలు నీళ్లు జాలుబారుతుంటే, ఆ నీళ్లల కాయితప్పడవలేసి, ఆడిండు. ఇగ రాజకీయాలల్లకు వచ్చినంక గూడ.. కార్ల పొయ్యేటప్పుడు ఏడ్నన్న బిడ్జి కనబడితే సాలు... ఆగి దాంట్లెకు ఓ రూపాయో, రెండో, ఐదురూపాల బిళ్లను ఇసిరేటోడు. అది బుడుంగన మునిగేదాంక ఆగి చూసి, అప్పుడు కదలేటోడు.
నీళ్లతోని ఇంత అనుభవం, ఇంత నైపుణ్యం ఉండి, జాలునీళ్లల్ల కాయితప్పడవలతోటి ఫ్లోటాలజీ, నీళ్లు పారే తీరు తెలిసిన ‘ఫ్లోవాలజీ’, మునిగే కాయిన్లతోని తెలుసుకున్న ‘బుడుంగాలజీ’, వాటర్ల నీటిశాతం, బురదల జిగటశాతం, ఉస్కెతోని రేణుశాస్త్రం.. ఇయన్నీ తెలుసుగాబట్టే.. తెల్లారితె బాహుబలి జలపాతాన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టే... కేసీఆర్ సారు గూడ పొద్దుందాక నీళ్లతత్వం అధ్యయనం చేసి, తెలుసుకునేది. ఆ అనుభవంతోని వచ్చినయే ఈ మేడిగడ్డలూ, అన్నారాలు... ఈ ప్రాజెక్టులన్నీ.
ఆ సిన్మాల బాహుబలి వాళ్ల అమ్మగారు బాధపడ్డట్టే... తెలంగాణ తల్లి కూడ బుగులుబడతాంది. కానీ..బక్కపానమైనా మాసారు బాహుబలికంటె ఎక్కువ బలమూ, సంకల్ప బలమూ ఉన్నోడు. ‘జటాకటాహ సంభ్రమ భ్రమ్మన్నిలింప నిరఝరీ, విలోలవీచి వల్లరీ విరాజమాన మూర్ధనీ.. ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే..కిశోర ‘‘చంద్రశేఖరే’’..అని మాసారు పేరు తోని బ్యాక్గ్రౌండ్ల పాట వినిపిస్తుండంగా...
ఎవ్వరంట ఎవ్వరంటా
పిల్లరెత్తుకుందీ?
తెలంగాణ తల్లికీ ముద్దులకొడుకీ నందీ.
ఉస్కెలో డస్కిందీ..బురదలో కుంగిందీ
పిల్లరెత్తుకున్నాక
భుజమ్మీద పెట్కోనీ పైకెత్తేనండీ...
ఇట్లా మునపటి లెవల్‌కు తెల్చి... తల్లితో ‘‘అమ్మా ఒప్పేనా?’’ అంటూ అడిగాడు. అప్పుడామె ‘‘నాకేమి తెలుసు? ఓటరు దేవరనడుగు?’’ అనగానే ఇటు తిరిగి... ఆయన ఓటరు దేవరనడిగాడు. అప్పుడు... ‘‘ఏమో శివుడి మనసులో ఏముందో... శివుడేటనుకుంటున్నాడో మనకేమి తెల్సు’’ అంటూ అప్పటికి గడుసుగా బదులిచ్చాడు ఓటరు దేవర.
Breadcrumb
అపర బాహుబలి మా కల్వకుంట్ల కేసీఆరయ్య!!
Published Wed, Nov 8 2023 4:58 AM
# Tag
Related news
-
వావ్ వాటే టెక్నాలజీ..కేసీఆర్ బస్సులో లిఫ్ట్
వావ్ వాటే టెక్నాలజీ..కేసీఆర్ బస్సులో లిఫ్ట్ -
చేవెళ్ల రణక్షేత్రం..సంపన్నుల సమరం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అందరి దృష్టి చేవెళ్లపైనే ఉంది. పల్లె, పట్టణాల కలబోతతో కూడిన ఈ లోక్‌సభ స్థానంలో మూడు ప్రధాన పార్టీలే కాదు.. ముగ్గురు సంపన్నులు పోటీ పడుతుండటమే ఇందుకు కారణం.గులాబీ కోటలో కమలం పువ్వును వికసింపజేయాలని బీజేపీ.. హస్తం హవా కొనసాగించాలని కాంగ్రెస్ భాస్తోంది. 2009లో మినహా ఇప్పటివరకు ఇక్కడ ఏ ఎన్నిక వచ్చినా కారుదే హవా. ఈసారి ఎలాగైనా కారు స్పీడ్‌కు బ్రేకులు వేయాలని బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. అయితే ఒకసారి గెలిచిన వారు రెండోసారి విజయం సాధించిన చరిత్ర లేకపోవడంతో ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అంచనాలకు అందవు.. వ్యూహాలకు చిక్కరు అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, అనుబంధ పరిశ్రమలకు నెలవైన చేవెళ్ల లోక్‌సభ స్థానంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లే కాదు.. ఉత్తరాది ఓటర్లు కూడా ఉన్నారు. వారిలో ముస్లింలు 15 శాతం, ముదిరాజ్‌లు 15 శాతం, మాదిగలు 15.71 శాతం, గౌడ్లు 9.50 శాతం, మాలలు 7.86 శాతం, యాదవులు 7.86 శాతం, లంబాడీలు 6.57 శాతం, రెడ్లు 5 శాతం, కమ్మలు 3.43 శాతం, లింగాయత్‌లు 3.36 శాతం, మున్నూరుకాపులు 3 శాతం ఓటర్లు ఉన్నట్లు అంచనా.అభ్యర్థుల గెలుపోటములను ముస్లింలు, ముదిరాజ్‌లే డిసైడ్ చేయనున్నారు. అయితే ఓటర్ల తీరు అంచనాలకు అందడం లేదు. రాజకీయ వ్యూహాలకు కూడా చిక్కడం లేదు. 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన ఈ మూడు ఎన్నికల్లో ఇదే అంశం స్పష్టమైంది. 2009లో కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి ఇక్కడ గెలవగా ఆ తర్వాత ఆయన మళ్లీ ఈ స్థానం నుంచి పోటీ చేయలేదు. 2014లో బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు నెలకొనగా కాంగ్రెస్ అభ్యర్థి ఎస్. జైపాల్‌రెడ్డి 18,532 ఓట్ల ఆధిక్యంతో జితేందర్‌రెడ్డిపై విజయం సాధించారు. ఇక్కడ 64.5 శాతం పోలింగ్ నమోదైంది. ఇద్దరి అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 1.7 శాతమే కావడం గమనార్హం. మొత్తం ఓట్లు: 16,81,664 పోలైన ఓట్లు: 10,83,490 అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం ఎస్.జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ 4,20,807 38.80 ఏపీ జితేందర్‌రెడ్డి టీడీపీ 4,02,275 37.102014 ఎన్నికల్లో 60.20 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో నోటాకు 10,018 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 73,023 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల కార్తీక్‌రెడ్డిపై గెలిచారు. మొత్తం ఓట్లు: 23,02,163 పోలైన ఓట్లు: 13,00,194 అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ 4,35,077 33.10 పి.కార్తీక్‌రెడ్డి కాంగ్రెస్ 3,62,054 27.50 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గెలుపు దోబూచులాడింది. చివరికి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి 1.1 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. నోటాకు 9,244 ఓట్లు పోలయ్యాయి.మొత్తం ఓట్లు: 21,85,179 పోలైన ఓట్లు: 13,15,862 అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం జి.రంజిత్‌రెడ్డి టీఆర్ఎస్ 5,28,148 40.60 కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ 5,13,831 39.05 ముగ్గురూ కోటీశ్వరులే.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (బీజేపీ) రూ.4,490 కోట్లు గడ్డం రంజిత్‌రెడ్డి (కాంగ్రెస్) రూ.869.77 కోట్లుకాసాని జ్ఞానేశ్వర్ (బీఆర్ఎస్) రూ. 520.70 కోట్లు అభ్యర్థులు వారే.. పార్టీలే వేరు ప్రస్తుతం బరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గతంలో వేర్వేరు పార్టీల నుంచి తలపడిన వారే. ప్రస్తుతం వారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకుతోపాటు రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ల, శేరిలింగంపల్లి, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముస్లిం ఓటర్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు హామీని ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రధాని మోదీపైనే భారం వేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి వంటి అర్బన్ ఏరియాల్లో ఉన్న బీజేపీ కేడర్, మోదీ అభిమానులను ఆయన టార్గెట్‌గా ఎంచుకున్నారు. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరులో వ్యక్తిగత పరిచయాలను నమ్ముకున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, శాసనమండలి సభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్ పోటీ పూర్తిగా బీసీ ఓటర్లనే నమ్ముకున్నారు. లోక్‌సభ స్థానంలో 16.50 లక్షల బీసీలు ఉంటారని, వారే తనను గెలిపించనున్నారనే ధీమాతో ఉన్నారు. -
రేవంత్‌కి ఓటమి భయం పట్టుకుంది
కరీంనగర్, సిద్దిపేటజోన్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం పదవి నుంచి దింపేస్తారనే భయం రేవంత్‌రెడ్డికి పట్టుకుందని, అందుకే ఇచ్చిన హామీలు, పరిపాలనపై మాట్లాడాల్సిన ఆయన అసహనంతో తిట్ల దండకాన్ని అందుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శనివారం కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని, ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే ప్రధాని మోదీని సీఎం బడేబాయి అంటున్నారని, రేవంత్‌రెడ్డి ఓ ఫైటర్ అని బండి సంజయ్ పొగుడుతున్నారని, రేవంత్‌రెడ్డి బీజేపీలోకి రావాలని ఎంపీ అర్వింద్ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎవరికి ఎవరు బీ టీమ్‌నో అర్థం అవుతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దోస్తీకు బోలెడు కారణాలు ఉన్నాయని, కరీంనగర్‌తోపాటు అనేక సీట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలిపి పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరిస్తోందన్నారు. నన్ను తిట్టినా ఫర్వాలేదు.. హామీలు అమలు చేయండి: హరీశ్ ‘‘నేను కొత్త డిమాండ్లను అమలు చేయమని అనలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అడుగుతున్నా. దానికి మీరు. మీ మంత్రులు నన్ను తిడుతున్నారు. నన్ను ఎంత తిట్టినా, ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నా.. హామీలు అమలయ్యే వరకు అడుగడుగునా నిలదీస్తా’’అని హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన సిద్దిపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆరు గ్యారంటీలు అమలయ్యేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నాడు ఓటుకు నోటు అయితే.. నేడు ఓటుకు ఒట్టు అని ఎద్దేవా చేశారు. సీఎం సవాల్ మేరకు అమరవీరుల స్తూపం వద్దకు తాను రాజీనామాతో వస్తే రేవంత్ మొఖం చాటేశారని విమర్శించారు. రాజీనామా ఎలా చేయాలో తనకు తెలుసని, పదవులు ముఖ్యం కాదని, ప్రజా ఆకాంక్షలే ముఖ్యమని పేర్కొన్నారు.గతంలో వచ్చిన తెలంగాణను కేంద్రం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కోరితే రేవంత్‌రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి మోసం చేసి పారిపోయారని విమర్శించారు. అప్పట్లో కిషన్‌రెడ్డి రాజీనామా చేయలేదని అలాంటి వారు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు అని మండిపడ్డారు. కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని, లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లా సరిపోతుందంటూ అందుకు కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హరీశ్ ఆరోపించారు. -
ఎన్నికల ముందు అభయహస్తం..ఎన్నికలయ్యాక భస్మాసుర హస్తం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే గెలవలేరని.. పరువు పోతుందనే పాలమూరు ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకొన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు విమర్శించా రు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభయ హస్తం అని కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేసిందని.. ఎన్నికలయ్యాక అది భస్మా సుర హస్తంగా మారిందని మండిపడ్డారు.రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరడం ఖాయమన్నారు. ఈ విషయాన్ని తాను 20 సార్లు చెప్పినా రేవంత్ ఖండించలేదని గుర్తించాలన్నారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక పెరిగిందని.. కరెంటు కోతలు, తాగునీటి కష్టాలు లేని కేసీఆర్ పాలనే తిరిగి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం చెప్పిన పథకాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా లబి్ధదారుల ఖాతాలో చేరలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ పార్టీ జెండాను ఎగురవేశారు. తర్వాత మీడియాతో చిట్‌చాట్ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రూ.4 వేల పెన్షన్, రైతు కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రైతు భరోసా, స్కూటీలు, నిరుద్యోగ భృతి, క్వింటల్ ధాన్యానికి రూ.500 బోనస్ వంటివేవీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అటకెక్కిస్తారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు 250 రోజులైనా చేయడం లేదు. దీనిపై హరీశ్‌రావు చేసిన సవాల్‌కు రేవంత్ సమాధానం చెప్పాలి. మాదిగ సామాజిక వర్గంతోపాటు మంత్రి పదవి దక్కని ముదిరాజ్ సోదరులు, ఎంపీ సీటు దక్కని గౌడ, యాదవ సోదరులు కాంగ్రెస్‌ను ఓడించాలని భావిస్తున్నారు. హైదరాబాద్ బీఆర్ఎస్కు పూర్తి మద్దతునిచ్చింది గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నగరం పూర్తిగా బీఆర్ఎస్కు మద్దతునిచ్చింది. ఉద్యమకారులు గొప్ప పరిపాలకులు కాలేరని బీజేపీ దివంగత నేత అరుణ్ జైట్లీ అన్నారు. కానీ అది తప్పు అని కేసీఆర్ నిరూపించారు, 14 ఏళ్లు ఉద్యమ పార్టీని నడపడం, తర్వాత పదేళ్లు ప్రభుత్వంలో కొనసాగడం, ఒక పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చిన్న విషయమేమీ కాదు. లోక్‌సభ ఎన్నికల్లో 10–12 సీట్లలో బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి పనులు చేయిస్తాం. రేవంత్‌కు మైనారిటీలను గౌరవించే సంస్కారం లేదు. ఒక్క మంత్రిపదవి కూడా ఇవ్వలేదు. రేవంత్ ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు? మోదీ నాయకత్వంలోనా? రాహుల్ గాంధీ నాయకత్వంలోనా? చోటా భాయ్.. బడే భాయ్.. ఇద్దరూ మోసగాళ్లే.. చోటాభాయ్ సీఎం రేవంత్, బడే భాయ్ ప్రధాని మోదీ ఇద్దరూ మోసగాళ్లే. మోదీ తెలంగాణ ఏర్పాటునే తప్పుపడుతూ మాట్లాడారు. మోదీ, రేవంత్‌రెడ్డిల మోసాలను చూశాక ప్రజలు కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారు. ప్రధాని మోదీని ఉత్తర భారత ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. బీజేపీని అడ్డుకునేవి ప్రాంతీయ పార్టీలే. కాంగ్రెస్ కాదు. తమిళనాడు సహా చాలా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీ లే మోదీని అడ్డుకుంటున్నాయి. ఏపీలోనూ ప్రాంతీయ పార్టీ లే గెలవాలని కోరుకుంటున్నాం. అక్కడ వైఎస్ జగన్ మరోసారి విజయం సాధించబోతున్నారని మాకు సమాచారముంది. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయి. రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరించేందుకే కొన్నిచోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టింది. కొందరు కాంగ్రెస్ అభ్యర్థులకు ఆ నియోజకవర్గాలతో సంబంధమే లేదు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీల కుట్రలను తిప్పికొట్టాలి.ప్రజలను మోసగించే ఎత్తుగడ ‘‘రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేస్తూ.. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానంటూ.. ప్రజలను మరోసారి మోసగించే ఎత్తుగడ వేస్తున్నారు. అసలు రేవంత్‌రెడ్డికి మాట నిలుపుకొన్న చరిత్ర లేదు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నారు. ఏమైంది? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కలు మొక్కుతున్నారు. దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసపోయిన ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దు.’’ – కేటీఆర్ పార్టీ కి పూర్వవైభవం తెస్తాం.. వరంగల్‌లో రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి ఎవరు ప్రచారం చేసినా కడియం శ్రీహరి, ఆయన కూతురు మూడో స్థానానికి వెళ్లడం గ్యారంటీ. కేసీఆర్‌కు కడియం చేసిన ద్రోహం మామూలుది కాదు. మల్కాజిగిరిలో ఈటల గెలుస్తారని మాజీ మంత్రి మల్లారెడ్డి చేసినవి వ్యంగ్య వ్యాఖ్యలే. బీఆర్ఎస్ నుంచి కొందరు నాయకులు వెళ్లిపోయినా.. కార్యకర్తలు ఎక్కడికీ వెళ్లలేదు. పార్టీని విస్తరిస్తాం, పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నిస్తాం..’’అని కేటీఆర్ చెప్పారు.ప్రతికూలతలను తట్టుకుని కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం తెలంగాణ భవన్‌తో పాటు అన్ని జిల్లా కార్యాలయాల్లోనూ పార్టీ జెండాను ఎగురవేసి జరుపుకొన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2001లో శూన్యంలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేసి.. ప్రతికూలతలను తట్టుకుని రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపించి, ప్రజాస్వామ్యయుతంగా అన్ని రాజకీయ పార్టీ లను కలుపుకొని దశాబ్దాల కలను సాకారం చేశారని తెలిపారు. ప్రజలందించిన సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. ఆనాడు సమైక్యవాదులు ఎన్ని రకాల కుట్రలు చేసినా ఛేదించుకుని విజయాన్ని చేరుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. అనంతరం తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి చేసినట్లు తెలిపారు. తెలంగాణ సాధించిన ప్రగతిని దేశవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినట్లు తెలిపారు. దీనికి మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషాల నుంచి అద్భుత స్పందన లభించిందని కేటీఆర్ పేర్కొన్నారు.దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అపజయాలకు కుంగిపోయేది లేదని భవిష్యత్తులోనూ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటామని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, పార్టీ కార్యాలయ ఇన్చార్జి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ‘‘రాష్ట్రం ఇప్పుడు భగ్గుమంటోంది. నా బస్సును కదలనివ్వనంత జనం.. వారి పూల స్వాగతమే చెప్తున్నాయి భవిష్యత్తు బీఆర్ఎస్దే నని.. కాంగ్రెస్ బలుపు దించాలి’’ అని వ్యాఖ్యా నించారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర ఐదో రోజు శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఏప్రిల్ 27.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి శంకుస్థాపన జరిగిన రోజు. 23 ఏళ్ల కింద తెలంగాణ సాధన కోసం పిడికెడు మందితో ఉక్కు సంకల్పంతో యుద్ధం ప్రారంభించిన రోజు.. బీఆర్ఎస్ పుట్టిన రోజు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు మీరు ఇచ్చిన మద్దతు.. అప్పటి ఘటనలు యాది చేసుకుంటే.. అదో ఉప్పెన, బ్రహ్మాండమైన సన్నివేశం. నేను మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నాం. ఈ గౌరవం చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి అడ్డగోలు హామీలిచ్చి, దు్రష్పచారం చేసి కేవలం 1.5 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి. పంటలు ఎండిపోయాయి. మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 20 రోజులైనా కొనే దిక్కులేదు. మేం రెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల పాటు అందించాం. ఇప్పుడు కాంగెస్ పాలనలో మళ్లీ రాత్రిపూట కరెంటు కోసం తిప్పలు, బావుల వెంట పరుగులు, కరెంటు షాకులు, తేళ్లు, పాములు.. ఈ బాధలు మళ్లీ ఎందుకు వచ్చాయి? రోజు సీఎం, మంత్రులు మీటింగ్‌లు పెట్టి 24 గంటల కరెంటు ఇస్తున్నామని అంటున్నారు. మరి ఈ రోజు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో నేను భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది. రోజుకు పది సార్లు ఇలానే పోతోందని చెప్తున్నారు. మళ్లీ బోర్లు, నీళ్ల ట్యాంకులు, బిందెలు ఎందుకు వచ్చాయో ఆలోచించండి. ప్రభుత్వ మెడలు వంచే బలం ఇవ్వండి గ్రామాల్లో పాలోళ్ల మధ్య పంచాయతీ జరిగితే పంచులను ఎన్నుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయతీలో ప్రజల తరపున యుద్ధం చేసే పంచు ఈ కేసీఆర్. ప్రాణం పోయినా తెలంగాణ తెస్తానని మాట ఇచ్చి.. తెచ్చి చూపించా. ఇప్పుడు మీ తరఫున వాదన వినిపించడానికి, ప్రభుత్వం మెడలు వంచడానికి మీరే బలం ఇవ్వాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీజేపీయే గెలుస్తుంది. అప్పుడేం లాభం ఉండదు. ఈ రోజు ఉదయమే రిపోర్టు వచ్చింది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్‌లలో బీఆర్ఎస్దే గెలుపు. రేవంత్‌రెడ్డివి సంస్కారం లేని మాటలు సీఎం రేవంత్‌రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నరు. నా గుడ్లు పీకి గోటీలు ఆడుతడట. పేగులు తీసి మెడలో వేసుకుంటాడట. పదిహేనేళ్లు పోరాటం చేసిన తెలంగాణ సాధించిన వ్యక్తిని, తెలంగాణను పదేళ్లలో తెల్లగ చేసిన, ప్రజల కష్టాలను చూసి తండ్లాడిన వ్యక్తిని అలా అనొచ్చా. ఇది «న్యాయమా ప్రజలే చెప్పాలి. మీ ఓటు ద్వారా ధర్మాన్ని గెలిపించండి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాగం జనార్దనరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పంటలు కావాలా.. మోదీ గత్తర కావాలా? బీజేపీ అక్కరకు రాని చుట్టం. మోదీ ఇచ్చిన వంద నినాదాల్లో ఒక్కటైనా నిజం అయిందా? మొన్న నాగర్ కర్నూల్‌కు గుజరాత్ సీఎం వచ్చారట. 1,500 మంది కూడా రాలే. మనకు గుజరాత్ నుంచి సీఎంలు రావాలా? మోదీ మోటార్లకు మీటర్లు పెట్టాలంటే.. నా తల తెగిపడ్డా పెట్టబోనని చెప్పిన. నేను రైతును.. నాకు వారి బాధలు తెలుసు. ఇప్పుడు మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా.. మోదీ వచ్చి మీటర్లు పెడతా అంటడు. పచ్చని పంటలు కావాలా? మోదీ గత్తర కావాలా? ఆలోచించండి. ఆర్ఎస్పీ లాంటి వాళ్లు మళ్లీ దొరకరు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అల్లాటప్పా వ్యక్తి కాదు. మాజీ ఐపీఎస్ అధికారి. అలంపూర్ బిడ్డ. నేను సీఎం అయ్యాక గురుకుల పాఠశాలలకు ఎంత బడ్జెట్ కావాలో తీసుకోవాలని చెప్పిన. నేడు తెలంగాణ గురుకుల పాఠశాలలు ఇంటర్నేషనల్ స్కూళ్లతో సమానం. ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారు. ఎవరెస్ట్ ఎక్కిన బిడ్డలను గురుకులాల నుంచి పంపినది ప్రవీణ్‌కుమారే. రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. ఇలాంటి వారు మళ్లీ దొరకరు. చదువుకున్నోళ్లు వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత.
Related News by category
-
Palakollu: నిమ్మలకు హ్యాట్రిక్ గండం
సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని హ్యాట్రిక్ గండం వెంటాడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడాల గోపికి లభిస్తున్న జనాదరణ, కూటమిలోని అసమ్మతి సెగలు, వరుసగా మూడోసారి పట్టం కట్టని పాలకొల్లు ప్రజల నాడి ఆయనకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికల్లోనూ చరిత్రే పునరావృతమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 70 ఏళ్ల చరిత్ర పాలకొల్లు శాసనసభ నియోజకవర్గానికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. 1955 నుంచి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983, 1985 అలాగే 1994, 1999 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు అల్లు వెంకటసత్యనారాయణ గెలుపొందారు. అయితే వరుసగా మూడోసారి పోటీచేసిన సందర్భంలో ప్రజలు ఆయన్ను ఓడించారు. తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలుపొందుతూ వచ్చిన రామానాయుడు ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు ఏ అభ్యరి్థకీ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి ప్రజలు పట్టం కట్టడం పాలకొల్లు చరిత్రలో లేదు. ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల ప్రచార ఆర్భాటంలో తప్ప అభివృద్ధిలో తనదైన ముద్రను వేసుకోలేకపోయారు. చెప్పుకోదగిన స్థాయిలో ప్రజాసమస్యలను పరిష్కరించలేకపోయారు. అయితే సీఎం జగన్ పాలనలోని ఈ ఐదేళ్లలో కులమత వర్గాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ లబ్ధిని చేకూర్చడంతో పాటు అభివృద్ధి పనుల్లోనూ పాలకొల్లుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పాలకొల్లు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సుమారు రూ.1,440 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా 6.84 లక్షల మంది లబి్ధదారులకు రూ.619 కోట్ల లబ్ధి చేకూరింది. మెడి‘కల’ సాకారం పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్ల వ్యయంతో 61 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 150 మంది విద్యార్థులు కళాశాలలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించనున్నారు. వంద పడకల ఆస్పత్రికి నిధుల మంజూరు లేకుండానే గత ఎన్నికల ముందు ఎమ్మెల్యే నిమ్మల ప్రజలను నమ్మిచేందుకు బోగస్ శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. కాగా సీఎం జగన్ పాలనలో రూ.16.60 కోట్ల వ్యయంతో 150 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టి పూర్తిచేయడం గమనార్హం. రూ.15 కోట్లతో పాలకొల్లులో తాగునీటి ఫిల్టర్ బెడ్ నిర్మించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రచారాస్త్రంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.అసమ్మతి సెగలు ఎమ్మెల్యే నిమ్మల వైఖరిపై కూటమి నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. స్వతహాగా కిందిస్థాయి కేడర్‌ను ఎదగనివ్వరని ఆయనకు పేరుంది. కూటమిలోని జనసేన, బీజేపీ నేతల విషయంలోను అదే వైఖరిని అవలంబిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి అవసరమైన సామగ్రిని అభ్యర్థి సమకూరుస్తుంటారు. కాగా ప్రచారంలో పాల్గొనే కూటమి నాయకులను ఎవరి పార్టీ జెండాలు వారే తెచ్చుకోవాలని సూచిస్తుండటంతో పాటు ప్రచారం చేసే సమయంలో తనను దాటుకుని ఎవరూ ముందుకు వెళ్లకూడదని ఆయన చెబుతున్నారంట. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీజేపీ పోటీ చేస్తున్న నేపథ్యంలో వారు జెండా ఖర్చులు భరించుకుంటారని, మద్దతు తెలుపుతున్న తమపై ఖర్చులు రుద్దుతున్నారని జనసేన నాయకులు అంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం సరిగా చెప్పడం లేదని మండిపడుతున్నారు. నియోజకవర్గంలో పట్టున్న జనసేన పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర చైర్మన్ బన్నీ వాసు ప్రెస్మీట్లకే తప్ప ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబునాయుడు వచ్చిన సందర్భంలో బన్నీవాసును వేదికపైకి రాకుండా అడ్డుకోవడం పట్ల ఆయన మనస్తాపానికి గురై వెళ్లిపోవడంతో మరుసటిరోజు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. ఆ అవమానభారంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. బీజేపీ నేతలకు కూడా నిమ్మల వ్యవహారశైలి మింగుడు పడటం లేదు.ప్రజలతో గోపి మమేకం ఓ పక్క ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడాల గోపి ప్రజలతో మమేకమవుతుంటే.. ఓటర్లను ఆకట్టుకునే విన్యాసాలే తప్ప చెప్పుకోవడానికి చేసిందేమీ లేదన్నట్టుగా నిమ్మల ప్రచారం సాగుతోందని సొంతగూటి నేతలే చెప్పుకుంటున్నారు. ఒక పక్క అధికార పక్షం జోరు, మరోపక్క పాల కొల్లు సెంటిమెంట్‌తో చరిత్ర పునరావృతమవుతుందని చెవులు కొరుక్కుంటున్నారు. -
కామినేని కట్టుకథలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒట్టు వేసి ఒక మాట.. వేయకుండా ఒక మాట చెప్పను.. ఇది పాపులర్ సినిమా డైలాగ్. అయితే ఈ నేత మాత్రం ఒట్టు వేసి మరీ చెప్పిన మాటలను అధికారంలోకి రాగానే కొల్లేటిలో కలిపేస్తారు. మళ్లీ ఎన్నికలు రాగానే అవే హామీలు, మాటలను మళ్లీమళ్లీ చెబుతూ ప్రజలను మభ్యపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. ఆయనే కైకలూరు బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. తనకు విస్తృత పరిచయాలు ఉన్నాయని.. కొల్లేరు సమస్యలు నరేంద్ర మోదీతో మాట్లాడి సెటిల్ చేస్తానని.. జలజీవన్ మిషన్ మనదేనని.. ఇంటింటికీ మంచినీరు ఇస్తానని ఇలా బిల్డప్ బాబాయ్ మాదిరిగా అడ్డగోలుగా మాటలు చెబుతూ రాజకీయం చేస్తుంటారు. కేవలం మూడు పారీ్టలు ఉంటేనే కూటమి బీజేపీ అభ్యరి్థగా బరిలో నిలవడం, మూడు పారీ్టలు లేకపోతే బీజేపీని స్థానికంగా గాలికి వదిలేసి విదేశాల్లో ఉండటం ఆయనకు సర్వసాధారణం. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇలాంటి మోసపూరిత హామీలు, ఒట్లతో కామినేని కైకలూరులో ప్రచారం చేస్తున్నారు. జెండాలు జతకడితేనే.. కామినేని శ్రీనివాస్ తనని తాను బీజేపీ నేతగా అభివరి్ణంచుకుంటారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యరి్థగా కైకలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయా రు. అయితే బడా వ్యక్తులతో ఆర్థిక సంబంధాలు, బంధుత్వాలతో బీజేపీ పెద్దాయన సూచనలతో 2014లో బీజేపీలో చేరి కైకలూరు నుంచి కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మొదటిసారి గెలిచిన వెంటనే చంద్రబాబు కేబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగారు. కట్ చేస్తే.. 2019లో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు లేకపోవడంతో హైదరాబాద్, అమెరికాకు పరిమితమై స్థానిక బీజేపీని పూర్తిగా నిరీ్వర్యం చేసి టీడీపీ నేతలకు సహకారం అందించారు. ఫలితంగా టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఐదేళ్ల పాటు కైకలూరు వైపు కన్నెత్తి చూడలేదు. తాజాగా పొత్తు ఆశలు చిగురించడం, మూడు పార్టీల చర్చలు మొదలు కావడంతో మళ్లీ కైకలూరు తనదేనంటూ హడావుడి మొదలుపెట్టి జెండా.. అజెండా లేకుండా నియోజకవర్గంలో కొద్దిరోజులు తిరిగారు. టికెట్ ఖరారు కావడంతో బీజేపీ అభ్యరి్థగా మళ్లీ తిరుగుతున్నారు. పెద్దింట్లమ్మపై ఒట్టు కామినేని శ్రీనివాస్‌కు ఒట్లు వేయడం బాగా అలవాటు. ఒక్కోసారి ఒక్కో దేవుడిని వాడుకుంటారు. ఒకసారి కాణిపాకం వినాయకుడు, మరో సారి కైకలూరు శ్యామలాంబ, కొల్లేటికోట పెద్దింట్లమ్మ, ఆయన స్వగ్రామంలో లక్ష్మీనృసింహస్వామి ఇలా అందరిపైనా ఒక రౌండ్ ఒట్లు వేసేశారు. 2014లో కాంటూరు కుదింపు, పెద్దింట్లమ్మ వారధి నిర్మిస్తానని కొల్లేటికోట పెద్దింట్లమ్మపై ఒట్టు వేసి నెరవేర్చని కామినేని తిరిగి మళ్లీ ఇటీవల అమ్మవారిపై కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తానని ఒట్టు వేశారు. చనిపోయిన తన అమ్మ చివరి కోరిక ఎమ్మెల్యే కావడం.. భవిష్యత్తులో ఇక పోటీ చేయనని, ఈసారి కొత్తగా అమ్మ సెంటిమెంట్‌తో జనాల్లోకి వెళుతున్నారు. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్పై స్వార్థంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారం అంతా అసత్యం, అబద్దమని పేర్కొన్నారు.రిజర్వేషన్లను ఆర్ఎస్స్ పూర్తిగా సమర్తిస్తుందని, ఎవరికోసం అయితే కేటాయించబడ్డాయో వారి అభివృద్ది జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపారు. రిజర్వేషన్లపై వివాదం సృష్టించి లబ్ది పొందాలని అనుకుంటున్నారని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇక... 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్పై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. -
బాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
సాక్షి, తాడిపత్రి: టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తు పెట్టుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అలాగే, చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపినట్టేనని సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు.కాగా, సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి సభలో మాట్లాడుతూ.. ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమేనా? తాడిపత్రి సిద్ధమేనా?. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు. జెండాలు జతకట్టుకుని వారంతా వస్తున్నారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపే. చంద్రబాబు సాధ్యం కానీ హామీలిస్తున్నారు.నా మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాను. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. 58 నెలల కాలంలో 2.31లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పౌరసేవల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రతీ గ్రామం, పట్టణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతు భరోసా కేంద్రం.. గ్రామాల్లోనే కనిపిస్తుంది. ఇంటి వద్దకే రేషన్ వస్తోంది. పెన్షన్లు నేరుగా మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. మీ బిడ్డ పాలనలో ఇంటి వద్దకే వైద్య సేవలు అందుతున్నాయి. మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే వస్తే మీ జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. నాడు-నేడుతో స్కూళ్ల రూపరేఖలను మార్చాం. టాప్ యూనివర్సిటీలతో మన డిగ్రీ కాలేజీలను అనుసంధానం చేశాం. ప్రభుత్వ స్కూల్స్‌లో హక్కుగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మరో 10, 15 ఏళ్లలో ఇలాంటి పాలనే ఉంటే ప్రజల జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. గతంలో ఎప్పుడైనా మహిళా సాధికారత చూశారా?.చట్టం చేసి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి నామినేటెడ్ పదవులు ఇచ్చాం. గతంలో ఎప్పుడైనా 31 లక్షల ఇళ్ల పట్టాలు చూశారా?.రైతు భరోసా పథకాన్ని ఎప్పుడైనా చూశారా?.80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో సగం స్థానాలు కేటాయించాం. మోసాలు, కుట్రలను నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా?. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది.రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశాడు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. ఆడపిల్ల పుట్టగానే బ్యాంకుల్లో రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్న చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారా?. అర్హుందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు అన్న చంద్రబాబు ఎవరికైనా ఇచ్చారా?. ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల పేరుతో మరో డ్రామా ఆడుతున్నారుసంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలితాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలిహామీలు నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరతున్నాడు. ప్రజలకు మంచి చేశాకే మీ బిడ్డ మీ దీవెనలు కోరుతున్నాడు అని కామెంట్స్ చేశారు. -
జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్‌కు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిపై నేను బహిరంగ చర్చకు సిద్ధం. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమా?. గత 35 సంవత్సరాల్లో జేసీ బ్రదర్స్ అనేక అరాచకాలు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది’ అని కేతిరెడ్డి అన్నారు.
Advertisement
Photos
View allVideo
View allదిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement