Sakshi News home page

CWC 2023 SA VS SL: 48 ఏళ్ల వరల్డ్‌కప్‌ చరిత్రలో తొలిసారి ఇలా..!

Published Sun, Oct 8 2023 9:44 AM

CWC 2023 SA VS SL: 100 Plus Boundaries Smashed For First Time In A WC Match - Sakshi

శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య నిన్న జరిగిన వరల్డ్‌కప్‌ మ్యాచ్‌కు సంబంధించిన రికార్డులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

  • వరల్డ్‌కప్‌లో హయ్యెస్ట్‌ టీమ్‌ స్కోర్‌ (సౌతాఫ్రికా, 428) రికార్డు,
  • వరల్డ్‌కప్‌లో తొలిసారిగా ఓఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు చేయడం, 
  • వరల్డ్‌కప్‌ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (మార్క్రమ్‌, 49 బంతుల్లో) రికార్డు, 
  • వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌ స్కోర్‌ (సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు కలిపి 754 పరుగులు చేశాయి) రికార్డు, 
  • వరల్డ్‌కప్‌లో 200 సెంచరీలు పూర్తి చేసుకున్న రికార్డు (వరల్డ్‌కప్‌లో 200వ సెంచరీ, మార్క్రమ్‌), 
  • వరల్డ్‌కప్‌లో తొలిసారి ఓ ఇన్నింగ్స్‌లో నలుగురు బౌలర్లు 80 అంతకంటే ఎక్కువ పరుగులు, ఇద్దరు బౌలర్లు 90 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు (శ్రీలంక)..

ఇలా ఈ మ్యాచ్‌ పలు ఆసక్తికర వరల్డ్‌కప్‌ రికార్డులు నమోదయ్యాయి. తాజాగా ఈ మ్యాచ్‌కు సంబంధించి మరో రికార్డు వెలుగుచూసింది. వరల్డ్‌కప్‌ టోర్నీల్లో తొలిసారి ఓ మ్యాచ్‌లో 100 కంటే ఎక్కువ బౌండరీలు నమోదు కావడం. నిన్నటి మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 105 బౌండరీలు (సౌతాఫ్రికా 45 ఫోర్లు, 14 సిక్సర్లు, శ్రీలంక 29 ఫోర్లు, 17 సిక్సర్లు) నమోదయ్యాయి. 48 ఏళ్ల వరల్డ్‌కప్‌ హిస్టరీలో ఈ స్థాయిలో బౌండరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేయగా.. శ్రీలంక 44.5 ఓవర్లలో  326 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వాన్‌ డర్‌ డసెన్‌ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్‌ డి కాక్‌ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో విరుచుకుపడగా.. లంక ఇన్నింగ్స్‌లో చరిత్‌ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్‌ మెండిస్‌ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), దసున్‌ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధసెంచరీలు నమోదు చేశారు. 

Advertisement

What’s your opinion

Advertisement