రైతుల అభ్యున్నతికి సీఎం కృషి 

29 Aug, 2019 10:27 IST|Sakshi
రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

సంక్షేమ పథకాలల్లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

భూత్పూర్‌లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ 

సాక్షి, భూత్పూర్‌ (దేవరకద్ర): రైతుల అభ్యున్నతి కోసం దేశంలో ఏ సీఎం చేపట్టని అభివృద్ధి పథకాలను కేసీఆర్‌ చేపట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం భూత్పూర్‌లోని కేఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతులు భూమి కొనుగోలు చేస్తే పట్టా చేసే వారికి ఇతరులకు తెలియకుండా ఉండేదని, ఇష్టానుసారంగా సాదాబైనామ అమలు చేసేవారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్‌ భూప్రక్షాళన చేపట్టడం, కుటుంబంలో రైతు మృతిచెందితే వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు పట్టా అమలు చేస్తున్నామన్నారు.

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 500 పాసు çపుస్తకాలు అందిస్తున్నామని, మరో 600 పాసుపుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసి రైతులకు అందించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌ అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణమ్మ, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ బస్వరాజ్‌గౌడ్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీపీ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూత్పూర్‌ (దేవరకద్ర): రైతుల అభ్యున్నతి కోసం దేశంలో ఏ సీఎం చేపట్టని అభివృద్ధి పథకాలను కేసీఆర్‌ చేపట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

బుధవారం భూత్పూర్‌లోని కేఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతులు భూమి కొనుగోలు చేస్తే పట్టా చేసే వారికి ఇతరులకు తెలియకుండా ఉండేదని, ఇష్టానుసారంగా సాదాబైనామ అమలు చేసేవారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్‌ భూప్రక్షాళన చేపట్టడం, కుటుంబంలో రైతు మృతిచెందితే వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు పట్టా అమలు చేస్తున్నామన్నారు.

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 500 పాసు పుస్తకాలు అందిస్తున్నామని, మరో 600 పాసుపుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసి రైతులకు అందించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌ అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణమ్మ, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ బస్వరాజ్‌గౌడ్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీపీ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వలస కార్మికులు తిరిగొస్తారు 
బిజినేపల్లి (నాగర్‌కర్నూల్‌): అప్పట్లో పాలమూరు పేరు చెబితేనే వలసలు, కరువు కాటకాలకు నిలయంగా ఉన్న పాలమూరు జిల్లా రాబోయే రోజుల్లో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ప్రతి ఎకరా మాగాణిగా మారి పచ్చదనంతో శోభిల్లుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. నాడు బీళ్లుగా ఉన్న పొలాలు సీఎం చలువతో రేపు పచ్చదనం సంతరించుకోనున్నాయని దాంతో పట్నం వలస పోయిన రైతన్న తిరిగి పాలమూరు బాట పట్టే రోజులు ముందరనే ఉన్నాయన్నారు. ఇప్పటికే మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరందిస్తూ సాగు పండగ జరుగుతుందన్నారు. మత్స్యకారులు, రైతుల జీవితాల్లో ఈ ప్రాజెక్టులు వెలుగులు నింపనున్నాయన్నారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పాలమూరు ప్రాజెక్టుకు ఊపిరిపోసి పెండింగ్‌లో ఉన్న పనులకు బకాయిలు చెల్లించి వేగవంతం చేయనున్నారన్నారు. వచ్చే వేసవి నాటికి పనులను పూర్తి చేసి 2020 ఖరీఫ్‌లో సాగునీటిని అందించాలనే లక్ష్యంలో ముందుకు సాగుతున్నారన్నారు. వట్టెంలోని వెంకటాద్రి రిజర్వాయర్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, నాయకులు రఘునందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు విజయ్, అమృత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, పులేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు