హోలీ వేడుకల్లో వింత ఆచారం

10 Mar, 2020 19:46 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలో బోధన్‌ మండలంలోని ఓ గ్రామంలో హోలీ వేడుకల్లో వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన హున్సాలో హోలీ సందర్భంగా గ్రామస్తులు పిడిగుద్దులాట ఆడారు. ఈ ఆటలో పాల్గొన్న గ్రామస్తులు ఒకరినొకరు కొట్టుకున్నారు. హోలీ రోజు ఈ విధంగా కొద్దిసేపు పిడిగుద్దులాట ఆడటం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత గ్రామస్తులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని.. హోలీ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఒక చోటుకు చేరి కొట్టుకునే ఆటను నిర్వహిస్తుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు