బాలిక నిశ్చితార్థాన్ని ఆపిన అధికారులు

7 Apr, 2017 18:56 IST|Sakshi

చండూరు(నల్గొండ) : ఓ మైనర్‌ బాలిక కు నిశ్చితార్థాన్ని ఐసీడీఎస్‌ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన గుండ్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కస్తాల గ్రామానికి చెందిన ఓ బాలిక చండూరు హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. ఈమె తల్లి కొంతకాలం కింద చనిపోయింది. దీంతో తండ్రి వెంకన్న ఆమె ఆలనాపాలన చూస్తున్నాడు. ఈ క్రమంలో గుండ్రపల్లికి చెందిన బాలిక మేనమామ శంకర్‌ మర్రిగూడ మండలం ఒట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో పెళ్లి చేసేందుకు  నిర్ణయించాడు.

రెండు రోజుల్లో నిశ్చితార్ధం పెట్టుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ జయమ్మ ఏఎస్‌ఐ శంకరయ్యతో కలిసి గ్రామానికి చేరుకుని బాలిక బంధువులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దాంతో బాలికకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి చేయమని కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు