ఆడపిల్లలను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

1 Aug, 2015 15:17 IST|Sakshi

ఇంద్రవెల్లి (ఆదిలాబాద్ జిల్లా) : గిరిజన ఆడపిల్లలను విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రవెల్లి మండలానికి చెందిన నర్సింగ్ అనే వ్యక్తి గిరిజన ఆడపిల్లలను పలు ప్రాంతాల్లో విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే ఏడు నెలల క్రితం ఉట్లూరు మండలానికి చెందిన ఒక గిరిజన ఆడపిల్లను రాజస్థాన్‌లో విక్రయించాడు.

కాగా శనివారం ఆ అమ్మాయి అక్కడి నుంచి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సింగ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఇప్పటి వరకు 10 మంది ఆడపిల్లలను విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రాజస్థాన్‌లో ఉన్న ఆ అమ్మాయిని స్వగ్రామానికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు