స్టేషన్ఘన్పూర్లో 144 సెక్షన్

5 Oct, 2016 08:57 IST|Sakshi
స్టేషన్ఘన్పూర్లో 144 సెక్షన్
వరంగల్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై రాష్ట్రంలో అక్కడకక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
స్టేషన్ఘన్పూర్ను కొత్తగా ఏర్పడే జనగామ జిల్లాలో కలపొద్దంటూ స్థానికులు ధర్నాలు, నిరసన ప్రదర్శనలకు దిగనున్నారు. దీంతో బుధవారం నుంచి వారం రోజుల పాటు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
 
మరిన్ని వార్తలు