ముగిసిన నామినేషన్ల పర్వం

14 Jan, 2019 10:30 IST|Sakshi
ఎడపల్లిలో నామినేషన్‌ వేసేందుకు బ్యాండు బాజాలతో వెళ్తున్న దృశ్యం

నిజామాబాద్‌అర్బన్‌: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్‌ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. బోధన్‌ డివిజన్‌ పరిధిలో ఈ నెల 11న ప్రారంభమైన నామినేషన్లు మూడు రోజుల పాటు కొనసాగాయి. ఆరు మండలాల్లోని 142 గ్రామ పంచాయతీలు, 1,296 వార్డులకు నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజైన ఆదివారం నామినేషన్లు జోరుగా కొనసాగాయి. బోధన్‌ మండలంలో 107, కోటగిరిలో 93, రెంజల్‌లో 167, రుద్రూర్‌లో 28, వర్నిలో 81, ఎడపల్లి మండలంలో 81 నామినేషన్లు చివరి రోజు దాఖలయ్యాయి.

నేడు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అదే రోజు బరిలో ఉన్న సర్పంచులు, వార్డు సభ్యుల వివరాలను వెల్లడిస్తారు. ఈ నెల 25న ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు కొనసాగుతాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు.

మరిన్ని వార్తలు