పంచాయతీ ఉప ఎన్నికలు ప్రశాంతం

5 Jul, 2015 01:33 IST|Sakshi
పంచాయతీ ఉప ఎన్నికలు ప్రశాంతం

 ఇందూరు : జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన మూడు ఎంపీటీసీ, నాలుగు సర్పంచ్, 63 వార్డు స్థానాలకు శనివారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్, వార్డులకు పగలు ఒంటిగం ట వరకు పోలింగ్ జరగగా, రెండు గంట లకు కౌటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. నాలుగు సర్పంచ్ స్థానాలనూ టీఆర్‌ఎస్ మద్దతుదారులే గెలుచుకున్నారు. ఎంపీటీసీలకు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈవీఎంలను సంబంధిత మండలాలలో భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు ఆరవ తేదీన జరుగనుంది. మూడు ఎంపీటీసీ, రెండు స ర్పంచ్ స్థానాలకు మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపారు. ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. 63 వార్డు స్థానాలకుగాను 31 ఏకగ్రీవం కాగా, 28 వార్డుకు బ్యా లెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. రెండు వార్డు స్థానాలకు నామినేషన్‌లు రాకపోవడంతో వీటికి ఎన్నికలు జరగలేదు.

 ఎంపీటీసీ స్థానాలకు 77.88శాతం పోలింగ్
 తాడ్వాయి మండలం నందివాడ స్థానానికి 2,573ఓట్లు ఉండగా,2,004 ఓట్లు పోల్ అయ్యాయి. 77.88 శాతం పోలింగ్ నమోదైంది. డిచ్‌పల్లి మండలం పడిపల్లి- 2 స్థానానికి  2,844 ఓట్లు ఉండగా, 1,511 ఓట్లు నమోదయ్యాయి. 53.16 పోలింగ్ శాతం నమోదైంది. నవీపేట్ మండలం యంచ స్థానానికి 2,461 ఓట్లకు గాను 1,911 ఓట్లు పోలయ్యాయి. 77.65 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా మూడు ఎంపీటీసీ స్థానాలకు కలిపి 7,874 ఓట్లకు గాను 5,426 ఓట్లు నమోదు అయ్యాయి. 68.91 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మూడు స్థానాలకు తొమ్మిది మంది పోటి పడ్డారు.

 సర్పంచ్, వార్డు స్థానాలకు 77.33 శాతం పోలింగ్
 నాలుగు సర్పంచ్ స్థానాలకు బాన్సువాడ మండలం కొల్లూరు సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. సర్పంచ్‌గా పల్లికొండ శోభరాణిని ఎన్నికయ్యారు. మిగిలిన బిచ్కుంద మండలం, కిష్టాపూర్(జె) సర్పంచ్ స్థానానికి గంగోండ, మద్నూరు మండలం తాడ్గూర్ (బీ) స్థానానికి కొండవార్ గంగాధర్ ఎన్నికయ్యారు. లింగంపేట్ మండలం భ వానీపేట్ స్థానానికి కమ్మరి పండరి ఎన్నికయ్యారు. సర్పంచ్, వార్డు స్థానాలలో 14,550 ఓట్లకుగాను 11,251 ఓట్లు పోలయ్యాయి. 77.33 శాతం పోలింగ్ నమోదైంది.

మరిన్ని వార్తలు